సినిమా పరిశ్రమకు చెందిన పలువురి హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు అందరినీ తీవ్రమైన ఆందోళనకు గురిచేశాయి. మొదట రష్మిక మందన్న ఆ తర్వాత కాజోల్, అలియా భట్‌లు ఈ భూతానికి గురి కావడం జరిగింది. ఈ వీడియోపై రష్మిక మందన్న కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, నాగ చైతన్య సహా పలువురు నటీనటులు ఇలాంటి ఘటనను ఖండించారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. యానిమల్ సినిమాతో రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. దానికి కారణం యానిమల్ సినిమాలోని రష్మిక మందన్న హాట్ సీన్స్ అని చెప్పవచ్చు.
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'యానిమల్' డిసెంబర్ 1న దేశవ్యాప్తంగా విడుదలైంది. ఇది తండ్రీ కొడుకుల మధ్య సాగే కథ. అయితే సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య హాట్ హాట్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నల మధ్య ముద్దుల సన్నివేశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. తండ్రీకొడుకుల సినిమా అయినప్పటికీ ఇందులో ఘాటైన ప్రేమకథ ఉందని నెటిజన్లు తెలుపుతున్నారు.
ఈ సినిమాలో రష్మిక మందన్న రణబీర్ కపూర్ భార్య గీతాంజలి పాత్రలో నటిస్తుంది. వీరిద్దరి మధ్య సన్నిహిత సన్నివేశాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు, క్లిప్‌లు ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాకు అడల్ట్స్ ఓన్లీ (ఏ) సర్టిఫికేట్ ఇవ్వడం సరైనదేనని పలువురు దుయ్యబట్టారు.
డీప్‌ఫేక్ వీడియో టాపిక్ మళ్లీ
యానిమల్ సినిమాలోని రష్మిక హాట్ ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రష్మిక మందన్నను ట్రోల్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం డీప్‌ఫేక్ వీడియోతో బాధపడి ఏడ్చింది రష్మికనేనా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఆమె డీప్ ఫేక్ వీడియోకు మించి ఎక్కువ మోతాదులోనే హాట్‌గా కనిపించిందని వారు తెలుపుతున్నారు. రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎందుకు చూడటం.. యానిమల్ సినిమాకు వెళ్లి చూడండి అంటూ వ్యంగ్యంగా తెలుపుతున్నారు. స్క్రీన్‌పై హాట్‌గా కనిపించడంలో లేని బాధ డీప్ ఫేక్ వీడియోల వల్ల ఇబ్బంది వచ్చిందా అంటూ ఆమెపై విమర్శలకు దిగుతున్నారు.
కానీ ఈ విషయంలో రష్మికకు కూడా కొందరు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదొక సినిమా అని మరిచిపోవద్దు. కథలో భాగంగా మాత్రమే ఆమె అలా నటించింది. అందుకు గట్స్ ఉండాలి. ఇలాంటి చెత్త కామెంట్లు చేయడం ఆపేయండని తెలుపుతున్నారు. ఆమెను అసభ్యంగా డీప్ ఫేక్ వీడియోలు చూపించారని కామెంట్ చేయలేదు.. టెక్నాలజీని ఇలాంటి పనులకు ఉపయోగించడం ఏంటని తప్పుబట్టింది. టెక్నాలజీ సాయంతో సామాన్యమైన యువతులతో పాటు సెలబ్రిటీలపై కూడా ఇంతకు మించిన వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేసే అవకాశం ఉందని పరోక్షంగా ఆమె తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment