బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన సూపర్‌హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.
యానిమల్ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని ఎదురు చూసిన ప్రేక్షకులకు తాజగా నెట్‌ఫ్లిక్స్ ఒక టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో యానిమల్ చిత్రం ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఈమేరకు చిన్న గ్లింప్స్ వదిలింది. అయితే ఈ వీడియో చివర్లో 'రూ.199 చెల్లించి చూడండి' అని సూచించింది. అంటే ఇది నెలవారీ సబ్‌స్క్రిప్షన్ వివరాలా? లేదంటే అద్దె పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు హింటిచ్చిందా? అన్నది అర్థం కాక నెటిజన్లు అయోమయానికి లోనవుతున్నారు.
యానిమల్ రన్‌టైమ్ 3:21 గంటలు కానీ ఓటీటీ కోసం అదనపు సీన్లు యాడ్ చేస్తున్నట్లు చిత్ర టీమ్ తెలిపింది. దీంతో ఈ సినిమా మూడున్నర గంటల నిడివి ఉండనుంది. 'యానిమల్ పార్క్' టైటిల్‌తో ఈ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మిస్తున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment