
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీపై మొదట చాలామంది విమర్శలొచ్చాయి. అయితే విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అదేస్థాయిలో వచ్చాయి. అయితే ఈ చిత్రంలో ఫైట్ సీన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
(ఇది చదవండి: 'యానిమల్' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్)
అయితే తాజాగా బాబీ డియోల్, రణ్‌బీర్ కపూర్ క్లైమాక్స్ ఫైట్ సీన్‌పై కాపీ విమర్శలు వైరలవుతున్నాయి. 2001లో వచ్చిన ఆషిక్ మూవీలోని సీన్‌ను కాపీ కొట్టారంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆషిక్ మూవీ వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. నేను పొరపాటున రాంగ్ యానిమల్ మూవీ సీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఆషిక్ చిత్రంలో బాబీ డియోల్ హీరోగా నటించారు.
అయితే గతంలోనూ యానిమల్‌పై కాపీ ఆరోపణలు వచ్చాయి. యానిమల్ ట్రైలర్‌ను విడుదలైన వెంటనే హువా మైన్ పాటలో రష్మిక, రణబీర్ ఫ్లైట్ సీన్‌ను 50 షేడ్స్ ఆఫ్ గ్రే చిత్రం కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అంతే కాకుండా మరో ఫైట్ సీక్వెన్స్ కొరియన్ చిత్రం నుండి కాపీ చేశారంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ, శక్తి కపూర్, సురేష్ ఒబెరాయ్, ప్రేమ్ చోప్రా బాలీవుడ్ తారలు నటించారు.
#Animal#AnimalReview #AnimalMovie #RanbirKapoor𓃵 #SandeepReddyVanga
Ranbir and Bobby Fight Scene Glimpse 🔥🔥🔥🔥 pic.twitter.com/ylMpVhIZov— ASHISH kushwaha (@ASHISHk18033956) December 2, 2023
Comments
Please login to add a commentAdd a comment