బాక్సాఫీస్ వద్ద యానిమల్ ప్రభంజనం.. 9 రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Sandeep Reddy Vanga Movie Animal Box Office Collections In 9 days | Sakshi
Sakshi News home page

Animal Movie: జైలర్‌, లియోను దాటేసిన యానిమల్‌..ఎన్ని కోట్లంటే!

Published Sun, Dec 10 2023 7:08 PM | Last Updated on Mon, Dec 11 2023 9:06 AM

Sandeep Reddy Vanga Movie Animal Box Office Collections In 9 days - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల వసూళ్లు రాబట్టింది. 

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ. 650కి పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో పఠాన్, జవాన్, గదర్-2 ఉన్నాయి. ఇదే స్థాయిలో కలెక్షన్స్ వస్తే త్వరలోనే వెయ్యి కోట్లకు చేరుకునేలా కనిపిస్తోంది. తొమ్మిది రోజుల్లో ఇండియావ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన యానిమల్.. ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల గ్రాస్​ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement