మూవీ లవర్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న 'యానిమల్' సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే అందరూ మూవీన చూసేస్తున్నారు. అయితే గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో గట్టిగా వినిపించిన ఓ విషయం మాత్రం జరగలేదు. దీంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు.
(ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)
'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ సృష్టించిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరస సినిమాలు తీశాడు. 'అర్జున్ రెడ్డి' రీమేక్‌గా 'కబీర్ సింగ్' తీసి బ్లాక్‌బస్టర్ కొట్టాడు. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' మూవీ తీశాడు. ఫ్యామిలీ డ్రామాకు తోడు వయలెన్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ కొంతమందికి తెగ నచ్చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. అలా డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని.. జనవరి 26న ఓటీటీలోకి తీసుకొచ్చేశారు.
అయితే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా 'యానిమల్' గురించి ఎన్నో విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరిన్ని సీన్లు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఎడిట్ చేసిన సన్నివేశాలు కూడా జోడిస్తారని తెగ ఊరించారు. తీరా ఇప్పుడు చూస్తే థియేటర్లలో చూసిన సినిమా కట్‌నే ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. దీంతో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన వాళ్లు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?)
Comments
Please login to add a commentAdd a comment