రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. విడుదలైన 12 రోజుల్లోనే దాదాపు 750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందంటే.. యానిమల్ ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాపై మొదట్లో విమర్శలు వచ్చాయి. కొన్ని సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయని, హింస ఎక్కువగా చూపించారంటో కొంతమంది విమర్శించారు.
ముఖ్యంగా బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బాబీ డియోల్.. ఓ సీన్‌లో పెళ్లి వేదికపై పెళ్లికూతురిపై అత్యాచారానికి పాల్పడతాడు. ఆ తర్వాత తన ఇద్దరు భార్యలను కూడా గదిలోకి రమ్మని బలవంతం చేస్తాడు. ఈ సన్నివేశాలపై విమర్శలు వచ్చాయి. వైవాహిక అత్యాచారాన్ని ప్రోత్సహించేలా ఆ సన్నివేశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో బాబీ డియోల్‌ని ట్రోల్ చేశారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై బాబీ డియోల్ స్పందించాడు. పాత్ర డిమాండ్ మేరకే ఆ సన్నివేశంలో నటించానని, ఆ సీన్ లేకుంటే యానిమల్ అంత పెద్ద హిట్ కాకపోయేదన్నాడు.
‘పాత్ర తీరుతెన్నులను అర్థం చేసుకొని నటించి ప్రేక్షకులను అలరించడమే నటుల పని. యానిమల్‌లో నేను పోషించిన అబ్రార్ హక్ పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్న సమయంలో క్యారెక్టర్ ఎలాంటిదో ప్రేక్షకులకు అర్థం కావాలనే అలాంంటి సీన్స్ క్రియేట్ చేశారు. సమాజంలో జరుగుతున్న ఘటనలే సినిమాల్లో కనిపిస్తాయి తప్ప.. వాటిని సినిమాలు ప్రమోట్ చేయట్లేదు’ అని బాబీ డియోల్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment