శ్రద్ధాకపూర్‌ మూవీ రికార్డ్.. ఏకంగా యానిమల్‌ను దాటేసింది! | Stree 2 beats Ranbir Kapoor Animal at Indian box office | Sakshi
Sakshi News home page

Stree 2 Collections: యానిమల్‌ను దాటేసిన స్త్రీ-2.. ఆ లిస్ట్‌లో రెండోస్థానం!

Published Tue, Sep 17 2024 8:29 PM | Last Updated on Fri, Sep 20 2024 12:38 PM

Stree 2 beats Ranbir Kapoor Animal at Indian box office

బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్‌, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్‌ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ.. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. అంతేకాకుండా గతంలోనే టాలీవుడ్ మూవీ బాహుబలి ది బిగినింగ్‌ వసూళ్లను దాటిన స్త్రీ-2.. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్ దేశవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్‌ను సైతం దాటేసింది.

కాగా.. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా నటించిన యానిమల్‌ గతేడాది విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేవలం ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.553 కోట్లు వసూళ్లు సాధించింది. తాజాగా స్త్రీ-2  రూ.583 కోట్ల వసూళ్లతో యానిమల్‌ చిత్రాన్ని దాటేసింది. అంతేకాకుండా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రాల్లో షారూఖ్ ఖాన్‌ జవాన్‌ (రూ.640 కోట్లు) తర్వాత రెండోస్థానంలో నిలిచింది. 

(ఇది చదవండి: బాహుబలిని దాటేసిన చిన్న సినిమా.. జవాన్‌పై గురి!)

అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 15న విడుదలైన ఈ హారర్ కామెడీ సినిమా.. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధాకపూర్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement