'జమల కుదు' పాటకు అల్లు అర్జున్ కూతురు క్యూట్ డ్యాన్స్ | Allu Arjun Daughter Allu Arha Recreates Bobby Deol Jamal Kudu Dance Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Allu Arha Jamal Kudu Dance Video: ఐకానిక్ స్టెప్పు వేసిన బన్నీ కుమార్తె.. వీడియో వైరల్

Published Fri, Feb 23 2024 7:11 PM | Last Updated on Fri, Feb 23 2024 7:55 PM

Allu Arha Jamal Kudu Dance Video - Sakshi

అల్లు అర్జున్ పేరు చెప్పగానే ఇతడి సినిమాలు గుర్తొస్తాయి. అదే టైంలో బన్నీ కొడుకు అయాన్, కూతురు అర్హ కూడా గుర్తొస్తారు. ఎందుకంటే పేరుకే చిన్న పిల్లలు అయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటారు. తాజాగా అల్లు అర్హ.. అలా 'యానిమల్' సినిమాలోని హిట్ పాటకు స్టెప్పులేసి వైరల్ అయిపోతోంది.

(ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?)

అల్లు అర్జున్ సినిమా వచ్చి దాదాపు రెండు మూడేళ్లకు పైనే అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఇతడి కొడుకు అయాన్ కూడా మోడల్ పోజులిస్తూ నవ్విస్తుంటాడు. కూతురు అర్హ కూడా ముద్దుముద్దుగా మాట్లాడుతూ వైరల్ అవుతూ ఉంటుంది. 

ఇకపోతే 'యానిమల్' సినిమాలోని 'జమల్ కుదు' పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ పాటలో తలపై గ్లాస్ పెట్టుకుని డ్యాన్స్ చేశారు. అర్హ మాత్రం తలపై ప్లేట్ పెట్టుకుని.. ఆ పాటని పోలినట్లు నడుస్తూ వచ్చింది. ఇప్పుడీ వీడియో వైరల్ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేసేయండి.

(ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement