
‘యానిమల్’మూవీతో సందీప్‌రెడ్డి వంగా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు పలువురు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ అనే సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే కెరీర్ ప్రారంభంలో మాత్రం సందీప్ చాలా ఇబ్బందులు పడ్డారట.
తొలి సినిమా అర్జున్ రెడ్డిని స్టార్ హీరోలతో చేసేందుకు తెగ ప్రయత్నించాడట.అల్లు అర్జున్‌తో ఈ సినిమా చేస్తే బాగుంటందని భావించి..ఆయనకు కథ వినిపించేందుకు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఒక్కసారి కూడా బన్నీని కలవలేకపోయాడట. చివరకు తన స్నేహితుడైన విజయ్ దేవరకొండతో ఈ సినిమా తెరకెక్కించాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి చెప్పారు.
‘2011లో ఒక్కసారి అల్లు అర్జున్‌ని కలిసి ఓ కథ చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి కథను రాసుకున్నాను. బన్నీని దృష్టిలో పెట్టుకొనే ఈ కథను రాశాను. అతన్ని కలిసి కథను వినిపించాలనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం లభించలేదు. దీంతో ఆ స్క్రిప్ట్ పట్టుకొని చాలా మంది హీరోలు, నిర్మాతలను కలిశాను. ఎవరూ ముందుకు రాలేదు. చివరకు నేనే నిర్మించాలని డిసైడ్ అయ్యాను. ఓ స్నేహితుడి ద్వారా విజయ్ పరిచయం కావడంతో అతన్ని హీరోగా సెలెక్ట్ చేసి సినిమాను తెరకెక్కించాను. విడుదల తర్వాత మా ఇద్దరికి మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది’అని సందీప్ అన్నారు.