ప్రాంతీయ చిత్ర సీమ నుంచి పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకుని చిత్రసీమలోనే అగ్ర కథానాయికగా రష్మిక మందన్న కొనసాగుతుంది. 2016లో కిరిక్ పార్టీ అనే సినిమాతో కన్నడలో అరంగేట్రం చేసింది. 2018లో ఛలో సినిమాతో హిట్ కొట్టి ఆపై విజయ్ దేవరకొండతో కలిసి 'గీత గోవిందం'తో మరింత పాపులారిటీని తెచ్చుకుంది. ఆపై పుష్ప,వారసుడు, సుల్తాన్,యానిమల్ వంటి చిత్రాల ద్వారా హిట్లు కొట్టి ప్రస్తుతం బిజీగా చిత్రపరిశ్రమలో కొనసాగుతుంది.
రష్మిక సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే, ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లకు ప్రత్యేక అభిమానుల సంఖ్య ఉంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన ముఖానికి ఫేస్ మాస్క్ ధరించి ఒక పోస్ట్ పెట్టింది. షూటింగ్ పనుల వల్ల బిజీగా ఉన్న సమయంలో కూడా తన అందాన్ని తాను ఎలా కాపాడుకుంటుందో ఒక పోస్ట్ ద్వారా తెలిపింది. ఆ పోస్ట్‌ను చాలామంది షేర్ చేస్తుండటం విశేషం. అందరం పనిలో పడిపోయి సమయం కూడా లేకుండా బిజీగా ఉన్నప్పుడు.. కనీస నిద్ర కూడా లేకపోవడం.. ఎక్కు ప్రయాణం చేయడం వంటి వాటితో చర్మం దెబ్బ తింటుందని రష్మిక తెలిపింది. అలాంటి సమస్య వచ్చినప్పుడు ఒక్కోసారి డెర్మటాలజిస్ట్ దగ్గరకు కూడా వెళ్లే సమయం ఉండదు. అప్పుడు ఏదైనా బ్యూటీ ఫేస్ మాస్క్‌లు ఉపయోగించడం సరైన మార్గమని ఆమె తెలిపింది.
సౌత్ ఇండియాలో పాపులర్ అయిన రష్మిక బాలీవుడ్‌లో నటుడు అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్‌బై' సినిమాతో అరంగేట్రం చేసింది. తరువాత, ఆమె ఇటీవలే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్'లో నటుడు రణబీర్ కపూర్ భార్య పాత్రను పోషించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యానిమల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని చిత్ర బృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment