యానిమల్‌ చూసి జనాలు ఆనందిస్తున్నారు, బాధేసింది: హీరో | RJ Balaji Reveals Why He Didn't Watch Animal Movie, Says Felt Bad Seeing Audience Enjoying The Film - Sakshi
Sakshi News home page

RJ Balaji On Animal Film: ఆడవారిపై హింస.. ఎంజాయ్‌ చేస్తున్నారు, నా వల్ల కాదు!

Published Thu, Jan 18 2024 9:17 AM | Last Updated on Fri, Jan 19 2024 6:10 PM

RJ Balaji Felt Bad Seeing Audience Enjoy Animal Film - Sakshi

కొన్ని చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధిస్తాయి.. కానీ కొందరికి నచ్చవు. మరికొన్ని చిత్రాలు పెద్దగా కలెక్షన్స్‌ రాబట్టలేవు, కానీ ఎంతోమందికి ఇట్టే కనెక్ట్‌ అవుతాయి. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్‌.. ఒక్కో సినిమాది ఒక్కో రిజల్ట్‌. ఈ మధ్య కాలంలో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధించిన చిత్రాల్లో యానిమల్‌ ఒకటి. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్‌ ఇండియా లెవల్‌లో ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ చిత్రంపై విమర్శలు కూడా వచ్చాయి.

అమ్మాయిని చులకనగా చూడటం నచ్చలేదు
తాజాగా తమిళ హీరో, దర్శకుడు ఆర్జే బాలాజీ యానిమల్‌ మూవీ నచ్చలేదంటున్నాడు. అతడు మాట్లాడుతూ.. 'థియేటర్‌లో నేను యానిమల్‌ సినిమా చూడలేదు, చూడాలనుకోలేదు కూడా! చాలామంది ఈ సినిమా చూడమని, అద్భుతంగా ఉందని సలహా ఇచ్చారు. నాకు నచ్చని అంశం ఏంటంటే.. ఒకమ్మాయిని కొడుతుంటే, తనను వేధిస్తుంటే థియేటర్‌లో జనాలు ఎంజాయ్‌ చేస్తున్నారు. దాన్ని నేను సహించలేను. అలాంటి సీన్లు ఎక్కువగా ఉన్న ఈ చిత్రాన్ని చూస్తూ జనాలు ఎంజాయ్‌ చేస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది.

నా సినిమాలో అయితే ఒప్పుకోను
అలాంటి సన్నివేశాలను చూసి ఆనందించడం సరైనది కాదు. ఇవి జనాలను ఏదో ఒకరకంగా ప్రేరేపిస్తాయి. అలాంటి సన్నివేశాలు నా సినిమాలో అయితే పెట్టనివ్వను. యానిమల్‌లో హీరో.. తృప్తి డిమ్రిని తన షూ నాకమన్నాడట. యూత్‌ ఇలాంటివి చూసినప్పుడు ఆడవాళ్లతో అలాంటి పనులు చేయించడం తప్పేం కాదని ఫీలవుతారు' అని ఆర్జే బాలాజీ చెప్పుకొచ్చాడు. కాగా యానిమల్‌ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా రాబట్టింది.

చదవండి: పాన్‌ ఇండియా సినిమాలో శ్రీదేవి ముద్దుల కూతురు!

whatsapp channel

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement