టీమిండియాకు మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దొరికేశాడు. అచ్చెం హార్దిక్ లాంటి బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్, అదే దూకుడైన కెప్టెన్సీ. అతడు ఎవరో కాదు మహారాష్ట్ర యువ సంచలనం, భారత జట్టు అండర్-19 ఆటగాడు అర్షిన్ కులకర్ణి. ప్రస్తుతం అండర్-19 ఆసియాకప్‌లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న అర్షిన్.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.
ఆల్‌రౌండ్ స్కిల్స్‌తో అకట్టుకుంటున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కులకర్ణి సత్తా చాటాడు. బౌలింగ్‌లో 3 కీలక వికెట్లు పడగొట్టిన ఈ యువ సంచలనం.. బ్యాటింగ్‌లో 70 పరుగులతో ఆజేయంగా నిలిచి భారత్‌కు తొలి విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో అర్షిన్ కులకర్ణి గురుంచి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఎవరీ అర్షిన్ కులకర్ణి..?
18 ఏళ్ల అర్షిన్ కులకర్ణి మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించాడు. అతడి తండ్రి అతుల్ కులకర్ణి వృత్తి రీత్యా వైద్యుడు. అతుల్ కులకర్ణి కూడా క్రికెటర్ అయ్యేందుకు అన్ని విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. క్రికెటర్ కావాల్సింది డాక్టరయ్యాడు. అయితే తన కలను కొడుకు రూపంలో నెరవేర్చకోవాలని అతుల్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తన కొడుకు చిన్నతనం నుంచే క్రికెట్ మెళకువలు నేర్పించాడు.
అర్షిన్ ప్రాధమికంగా షోలాపూర్‌లో శిక్షణ పొందాడు. అయితే అతడిలో అద్భుత టాలెంట్‌ను గుర్తించిన కోచ్‌లు మెరుగైన క్రికెట్ అవకాశాల కోసం పూణేకు మకాం మార్చమని కోరారు. అదే సమయంలో మహారాష్ట్ర అండర్-14 జట్టులో అర్షిన్ కులకర్ణికి చోటు దక్కడంతో అతడి తండ్రి తన ఫ్యామిలీని పుణేకు షిప్ట్ చేశాడు. పుణేలోని కాడెన్స్ అకాడమీలో అర్షిన్ కులకర్ణి తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు.
ఓ వైపు క్రికెట్‌తో ప్రయాణం సాగిస్తునే చదువును కూడా కొనసాగించాడు. వారానికి నాలుగు రోజులు షోలాపూర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌కు వెళ్లి విద్యను అభ్యసించేవాడు. ఆ తర్వాత వినూ మన్కడ్ ట్రోఫీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన అర్షిన్ కులకర్ణి.. మహారాష్ట్ర సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదే విధంగా మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో కూడా అర్షిన్ దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే భారత అండర్-19 ఆసియాకప్ జట్టుకు అర్షిన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
హార్దిక్‌ను కలిసిన అర్షిన్
అర్షిన్‌కు హార్దిక్ పాండ్యా ఆరాద్య క్రికెటర్. ఆసియాకప్‌లో పాల్గోనేందుకు వెళ్లే ముందు బెంగళూరులోని ఏన్సీఏలో హార్దిక్‌ను కులకర్ణి కలిశాడు. హార్దిక్ నుంచి విలువైన సూచనలు స్వీకరించాడు. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా ఏన్సీఏలో చికిత్స పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment