women arrested
-
ఆ మైనర్ యువకుడే కావాలంటూ రచ్చ.. మహిళ అరెస్ట్!
ముంబై : మైనర్ యువకుడ్ని పెళ్లి చేసుకున్న మహిళ.. అతనితో ఉండనివ్వకపోతే చచ్చిపోతానంటూ రచ్చ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఇరవై రెండేళ్ల మహిళ 17ఏళ్ల మైనర్‌ను పెళ్లి చేసుకుంది. తనతో కలసి ఉండనివ్వాలని ఆ మైనర్ ఇంట్లో నానా హంగామా చేసింది. తనతో ఉండనివ్వకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించింది. అయితే ఈ విషయంపై ఆ మైనర్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తమ కుమారుడు ఇంట్లోంచి ఎక్కడికో వెళ్లిపోయాడని, ఆ మహిళకు ఐదు నెలల ఆడబిడ్డ కూడా ఉందని, అంతేకాకుండా ఇప్పటికే తనకు రెండుసార్లు విడాకులయ్యాయని తమ బిడ్డను ఆ మహిళ హింసిస్తోందని. మాయమాటలు చెప్పి వివాహం చేసుకుందని.. తమ బిడ్డకు, ఆ మహిళకు గత రెండేళ్ల నుంచి పరిచయం ఉందని పేర్కొంది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. పోక్సో , బాల్య వివాహాల చట్టం కింద ఆ మహిళను అరెస్ట్ చేశారు. -
ఒంటరి మహిళలే టార్గెట్
వరంగల్ క్రైం : ఒంటరిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న మహిళను ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు. శుక్రవారం కమిషనరేట్‌లో ఆయన మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందారావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన కట్రోజు విజయ కొన్ని సంవత్సరాల క్రితం జీవనోపాధికి తన భర్తతో వరంగల్‌కు వచ్చింది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత భర్త వదిలివేయడంతో ఆమె బీడీలు చేస్తూ కుటుంబాన్ని సాకుతూ వచ్చింది. కుటుంబం సాకడం భారంగా మారడంతో దొంగతనాలకు చేయడం మొదలెట్టిందన్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని బస్ స్టేషన్లో ప్రమాణికులు బస్సులు ఎక్కే క్రమంలో చోరీలకు పాల్పడిందన్నారు. ఇప్పటి వరకు నిందితురాలు రూ.5.65లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు దొంగతనం చేసిందని సీపీ వివరించారు. కాగా శుక్రవారం ఉదయ ఉదయం చోరీ చేసిన బంగారు ఆభరణాలను అమ్మెందుకు వరంగల్ చౌరస్తా బులియన్ మార్కెట్‌కు వచ్చినట్లు ఇన్స్పెక్టర్ రవికుమార్‌కు వచ్చిన సమాచారంతో ఎస్సై వెంకటకృష్ణ తన సిబ్బందితో వెళ్లి నిందితురాలిని అరెస్టు చేసి విచారించగా నేరం ఒప్పుకుందని సీపీ తెలిపారు. -
చోరీకేసులో మహిళ అరెస్టు
రెండులక్షల విలువైన బంగారం,సెల్ఫోన్లు స్వాధీనం రాజమహేంద్రవరం రూరల్ : ఆటోలో వెళ్తున్న తోటి ప్రయాణికురాలు వద్ద హ్యాండ్‌బ్యాగ్ దొంగిలించిన మహిళను శనివారం బొమ్మూరు ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి రూ.రెండు లక్షలు విలువైన బంగారపు సొత్తును, సెల్ఫో¯ŒSను స్వాధీనం చేసుకున్నట్టు తూర్పుమండల డీఎస్పీ రమేష్‌బాబు తెలిపారు. శనివారం బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒSలో కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 16న రాజమహేంద్రవరం సీతంపేటకు చెందిన మధిర శ్రీదేవి మాణిక్యాంబ దివా¯ŒSచెరువు స్టేట్‌బ్యాంకుకు వెళ్లేందుకు కంబాలచెరువుసెంటర్లో ఆటో ఎక్కారు. దారిలో లాలాచెరువుసెంటర్‌లో సుమారు 45 ఏళ్ల మహిళ ఆటోఎక్కింది. దివా¯ŒSచెరువు స్టేట్‌బ్యాంకు వద్ద మాణిక్యాంబ ఆటో దిగి పది నిమిషాల అనంతరం సుమారు 11 కాసులు బరువు కల్గిన ఏడు బంగారుగాజులు, ఒక సామ్సంగ్ సెల్ఫో¯ŒSతో ఉన్న తన హ్యాండ్‌బ్యాగ్ ఆటోలో మరిచిపోయినట్లు గుర్తించింది. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ కనకారావు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు లాలాచెరువుసెంటర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న రంగంపేట మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన బల్లి లక్షి్మని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో బల్లి లక్ష్మి గత నెల 16న శ్రీదేవిమాణిక్యాంబతో పాటు ఆటోలో ప్రయాణించి హ్యాండ్‌బ్యాగును చోరీ చేసినట్టు ఒప్పుకుందని తెలిపారు. ఆమె నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు,ఎస్సైలు కిషోర్‌కుమార్, నాగరాజు, ఏఎస్సై శివాజీ పాల్గొన్నారు. మహిళా కానిస్టేబుల్ లేకుండానే... మహిళా ముద్దాయిని అరెస్టు చేసే సమయంలోను, ఆమెను తనిఖీచేసే సమయంలోను, విలేకరులకు అరెస్టు చూపే సమయంలోను, కోర్టులో హాజరుపరిచే సమయంలోను మహిళా కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలి. అరెస్టు చూపే సమయంలో తప్పనిసరిగా మహిళా కానిస్టేబుల్ పక్కన ఉండాలి. కాని అటువంటి నిబంధనలు ఏమి పాటించకుండానే పోలీసు అధికారులు నిందితురాలిని చూపించడం వారి పనితీరుకు అద్దంపట్టింది. డీఎస్పీ స్థాయి అధికారి ఉన్నప్పటికీ ఈవిషయాన్ని పరిగణనలోనికి తీసుకోకపోవడం విశేషం. -
ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం.. తల్లీకూతుళ్ల అరెస్ట్
పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు విదేశీ మహిళలు బుల్లెట్లతో సంచరిస్తూ కలకలం సృష్టించారు. కోల్ కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానితులుగా గుర్తించి ఇద్దరు మహిళలను ఎయిర్ పోర్టు అధికారులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళల లగేజీని పూర్తిగా పరిశీలించగా వారి వద్ద కొన్ని బుల్లెట్లు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మొదటగా వారి హ్యాండ్ బ్యాగ్స్ స్కాన్ చేయగా ఎదో ఉన్నట్లు అనుమానం వచ్చి, లగేజీని పూర్తిగా చెక్ చేయడంతో వారి వద్ద బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించామని వారిద్దరూ తల్లీకూతుళ్లు అని అధికారులు వెల్లడించారు. నేతాజీ ఎయిర్ పోర్టు నుంచి ఎమిరేట్స్ విమానంలో వారు దుబాయ్ కి వెళ్లి, అక్కడి నుంచి ఇటలీకి వెళ్లనున్నట్లు ఆ మహిళలు చెప్పారని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఆ తల్లీకూతుళ్లు ఫ్రాన్స్ కు చెందిన వారిని, ప్రస్తుతం వారిని విచారణ చేస్తున్నట్లు వివరించారు. వారి వద్ద నుంచి 5 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రియుడితో కలిసి భర్త హత్య
వీడిన కేసు మిస్టరీ.. వేధిస్తున్నాడని చంపేసింది కేసు వివరాలు వెల్లడించిన సీఐ వెంకట్రామయ్య తాండూరు : వ్యక్తి హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తనను వేధిస్తున్నాడని మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య శనివారం తన కార్యాలయంలో ఎస్ఐ చతుర్వేదితో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పాత తాండూరు(మున్సిపల్ క్వార్టర్స్)కు చెందిన జెంతపాగ నాగరాజు(37), నాగలక్ష్మి దంపతులు. నాగరాజు కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడు తరచూ మద్యం తాగుతూ భార్యను కొట్టేవాడు. నాగలక్ష్మికి మున్సిపల్ క్వార్టర్స్‌లో ఉంటున్న మున్సిపల్ కార్మికుడు బ్యాగరి వెంకటప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త వేధింపులను ఆమె వెంకటప్పతో మొరపెట్టుకునేది. ఈక్రమంలో ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయాలని నాగలక్ష్మి పథకం వేసింది. ఈనెల 6న నాగలక్ష్మి వెంకటప్పకు రూ.3 వేలు ఇచ్చింది. నాగరాజును వెంకటప్ప ఇంట్లోంచి తీసుకొని ఫూటుగా మద్యం తాగించి అర్ధరాత్రి సమయంలో తీసుకొచ్చి ఆరుబయట పడుకోబెట్టి వెళ్లాడు. అనంతరం నాగలక్ష్మి ప్రియుడితో కలిసి భర్తపై గొడ్డలితో దాడి చేసి చంపేసింది. ఇద్దరూ కలిసి నాగరాజు పురుషాంగాన్ని కత్తితో కోశారు. మరుసటి రోజు నాగరాజు హత్య విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే. మొదటగా నాగరాజును గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి ఉండొచ్చని పోలీసులు భావించారు. నాగలక్ష్మి, వెంకటప్పలపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి సోదరి బాలమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈకోణంలో పోలీసులు శనివారం వారిద్దరిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా హత్య నేరం అంగీకరించి పైవిషయాలు తెలిపారు. నిందితులను రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు. -
మేల్ ఎస్కార్ట్స్ అంటూ కి'లేడీ' కుచ్చుటోపీ
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఓ కి'లేడీ'ని పోలీసులు అరెస్ట్ చేశారు. 'మగ వ్యభిచారులుగా (మేల్ ఎస్కార్ట్స్)గా ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు శుభవార్త. మంచి జీతం, కమీషన్ ఇస్తాం..ఇంకెందుకు ఆలస్యం... మమ్మల్ని సంప్రదించండి'.... అంటూ పాతబస్తీకి చెందిన ఫర్హీన్ నాజ్ సిమ్రాన్ ఫ్రెండ్స్ యూత్ క్లబ్ పేరుతో వెబ్సైట్ ప్రారంభించింది. ఇంటర్నెట్, ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రకటనలిచ్చి వందమందికిపైగా యువకుల నుంచి డబ్బులు వసూలు చేసింది. రిజిస్ట్రేషన్ కోసం 5వేల నుంచి 7వేల వరకు వసూలు చేసింది. ఇలా కొద్ది నెలల వ్యవధిలోనే మూడున్నర లక్షల వరకు వసూలు చేసింది. అయితే డబ్బు ముట్టిన తర్వాత ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్లుగా ఫ్రెండ్స్ క్లబ్ మాటున ఫర్హీన్ నాజ్ మోసం చేస్తున్నట్లు బయటపడింది. ఆమె దగ్గర నుంచి ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ మేల్ ఎస్కార్ట్స్ పేరిట మోసానికి పాల్పడిన కర్నూలు జిల్లాకు చెందిన కనకబోయిన వరప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
శంషాబాద్‌లో 20 కేజీల మాదక ద్రవ్యం పట్టివేత
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నిషేధిత మాదకద్రవ్యం ఎఫెడ్రిన్‌ను అక్రమంగా తరలిస్తున్నదక్షిణాఫ్రికా మహిళను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. రన్లీద (30) అనే మహిళ 20 కేజీల ఎఫెడ్రిన్‌తో దక్షిణాఫ్రికాకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా ఆమెను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద ఉన్న 20 కేజీల ఎఫెడ్రిన్‌ను స్వాధీనం అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హెరాయిన్ స్వాధీనం: మహిళ స్మగ్లర్లు అరెస్ట్
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని షామిలి జిల్లాలో కైరానా పట్టణంలో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఓ ఇంట్లో దాచి ఉంచిన దాదాపు 200 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు మహిళ స్మగ్లర్లు రిహనా, సోనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హెరాయిన్ సీజ్ చేసి... స్మగ్లర్లను పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితులపై ఎన్డీపీసీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కైరానా పట్టణంలో ఇటీవల కాలంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఆ క్రమంలో ఓ ఇంట్లో హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు నివాసంలో తనిఖీలు నిర్వహించారు. సీజ్ చేసిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.