ఆ మైనర్‌ యువకుడే కావాలంటూ రచ్చ.. మహిళ అరెస్ట్‌! | Women Marries A Minor Boy And She Was Arrested | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 30 2018 2:39 PM | Last Updated on Fri, Nov 30 2018 4:39 PM

Women Marries A Minor Boy And She Was Arrested - Sakshi

ముంబై : మైనర్‌ యువకుడ్ని పెళ్లి చేసుకున్న మహిళ.. అతనితో ఉండనివ్వకపోతే చచ్చిపోతానంటూ రచ్చ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఇరవై రెండేళ్ల మహిళ 17ఏళ్ల మైనర్‌ను పెళ్లి చేసుకుంది. తనతో కలసి ఉండనివ్వాలని ఆ మైనర్‌ ఇంట్లో నానా హంగామా చేసింది. తనతో ఉండనివ్వకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించింది. 

అయితే ఈ విషయంపై ఆ మైనర్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తమ కుమారుడు ఇంట్లోంచి ఎక్కడికో వెళ్లిపోయాడని, ఆ మహిళకు ఐదు నెలల ఆడబిడ్డ కూడా ఉందని, అంతేకాకుండా ఇప్పటికే తనకు రెండుసార్లు విడాకులయ్యాయని తమ బిడ్డను ఆ మహిళ హింసిస్తోందని. మాయమాటలు చెప్పి వివాహం చేసుకుందని.. తమ బిడ్డకు, ఆ మహిళకు గత రెండేళ్ల నుంచి పరిచయం ఉందని పేర్కొంది. ఆమె  ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. పోక్సో , బాల్య వివాహాల చట్టం కింద ఆ మహిళను అరెస్ట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement