బంగారు ఆభరణాలను పరిశీలిస్తున్న సీపీ రవీందర్
వరంగల్ క్రైం : ఒంటరిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న మహిళను ఇంతేజార్‌గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు. శుక్రవారం కమిషనరేట్‌లో ఆయన మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందారావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన కట్రోజు విజయ కొన్ని సంవత్సరాల క్రితం జీవనోపాధికి తన భర్తతో వరంగల్‌కు వచ్చింది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత భర్త వదిలివేయడంతో ఆమె బీడీలు చేస్తూ కుటుంబాన్ని సాకుతూ వచ్చింది.
కుటుంబం సాకడం భారంగా మారడంతో దొంగతనాలకు చేయడం మొదలెట్టిందన్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని బస్ స్టేషన్‌లో ప్రమాణికులు బస్సులు ఎక్కే క్రమంలో చోరీలకు పాల్పడిందన్నారు. ఇప్పటి వరకు నిందితురాలు రూ.5.65లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు దొంగతనం చేసిందని సీపీ వివరించారు. కాగా శుక్రవారం ఉదయ ఉదయం చోరీ చేసిన బంగారు ఆభరణాలను అమ్మెందుకు వరంగల్ చౌరస్తా బులియన్ మార్కెట్‌కు వచ్చినట్లు ఇన్స్‌పెక్టర్ రవికుమార్‌కు వచ్చిన సమాచారంతో ఎస్సై వెంకటకృష్ణ తన సిబ్బందితో వెళ్లి నిందితురాలిని అరెస్టు చేసి విచారించగా నేరం ఒప్పుకుందని సీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment