- రెండులక్షల విలువైన బంగారం,సెల్‌ఫోన్లు స్వాధీనం
చోరీకేసులో మహిళ అరెస్టు
Published Sat, Dec 3 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
రాజమహేంద్రవరం రూరల్ :
ఆటోలో వెళ్తున్న తోటి ప్రయాణికురాలు వద్ద హ్యాండ్‌బ్యాగ్ దొంగిలించిన మహిళను శనివారం బొమ్మూరు ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి రూ.రెండు లక్షలు విలువైన బంగారపు సొత్తును, సెల్‌ఫో¯ŒSను స్వాధీనం చేసుకున్నట్టు తూర్పుమండల డీఎస్పీ రమేష్‌బాబు తెలిపారు. శనివారం బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒSలో కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 16న రాజమహేంద్రవరం సీతంపేటకు చెందిన మధిర శ్రీదేవి మాణిక్యాంబ దివా¯ŒSచెరువు స్టేట్‌బ్యాంకుకు వెళ్లేందుకు కంబాలచెరువుసెంటర్‌లో ఆటో ఎక్కారు. దారిలో లాలాచెరువుసెంటర్‌లో సుమారు 45 ఏళ్ల మహిళ ఆటోఎక్కింది. దివా¯ŒSచెరువు స్టేట్‌బ్యాంకు వద్ద మాణిక్యాంబ ఆటో దిగి పది నిమిషాల అనంతరం సుమారు 11 కాసులు బరువు కల్గిన ఏడు బంగారుగాజులు, ఒక సామ్‌సంగ్ సెల్‌ఫో¯ŒSతో ఉన్న తన హ్యాండ్‌బ్యాగ్ ఆటోలో మరిచిపోయినట్లు గుర్తించింది. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ కనకారావు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు లాలాచెరువుసెంటర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న రంగంపేట మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన బల్లి లక్షి్మని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో బల్లి లక్ష్మి గత నెల 16న శ్రీదేవిమాణిక్యాంబతో పాటు ఆటోలో ప్రయాణించి హ్యాండ్‌బ్యాగును చోరీ చేసినట్టు ఒప్పుకుందని తెలిపారు. ఆమె నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు,ఎస్సైలు కిషోర్‌కుమార్, నాగరాజు, ఏఎస్సై శివాజీ పాల్గొన్నారు.
మహిళా కానిస్టేబుల్ లేకుండానే...
మహిళా ముద్దాయిని అరెస్టు చేసే సమయంలోను, ఆమెను తనిఖీచేసే సమయంలోను, విలేకరులకు అరెస్టు చూపే సమయంలోను, కోర్టులో హాజరుపరిచే సమయంలోను మహిళా కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలి. అరెస్టు చూపే సమయంలో తప్పనిసరిగా మహిళా కానిస్టేబుల్ పక్కన ఉండాలి. కాని అటువంటి నిబంధనలు ఏమి పాటించకుండానే పోలీసు అధికారులు నిందితురాలిని చూపించడం వారి పనితీరుకు అద్దంపట్టింది. డీఎస్పీ స్థాయి అధికారి ఉన్నప్పటికీ ఈవిషయాన్ని పరిగణనలోనికి తీసుకోకపోవడం విశేషం.
Advertisement
Advertisement