ఉపఎన్నికపై మంత్రి సంచలన ప్రకటన | my family member will contest from nandyal, says bhuma akhila priya | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 19 2017 3:21 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

నంద్యాల ఉప ఎన్నికలలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విజయవాడ భవానీ ఐలండ్‌లో పర్యటించిన ఆమె.. పర్యాటకానికి సంబంధించిన విషయాలతో పాటు ఈ అంశంపై కూడా స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ ఎన్నికలలో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తారని, తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి అయిన 24వ తేదీన అభ్యర్థిని ప్రకటిస్తామని ఆమె ఏకపక్షంగా ప్రకటించారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం ఉప ఎన్నిక గురించి ఇంతవరకు పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు గానీ, ఆయన కుమారుడు లోకేష్ గానీ ఒక్క మాట కూడా చెప్పకముందే అఖిలప్రియ ఈ విషయాన్ని వెల్లడించడం నేతలను విస్మయపరిచింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement