![ఆర్కేనగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/81489051161_625x300.jpg.webp?itok=qA77YvCp)
ఆర్కేనగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : తమిళనాడులో మరో కీలక ఎన్నికకు నగారా మోగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలిలత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 12న ఆర్కే నగర్ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. 17న ఉప ఎన్నిక ఫలితం రానుంది.
జయలలిత మృతి, శశికళ జైలుకు వెళ్లడం తదితర పరిణామాలు నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అధికార అన్నాడీఎంకే పార్టీ పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలుగా చీలడం, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయ అరంగేట్రం చేయడంతో పాటు ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ఈ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
కాగా ఖాళీ అయిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఆర్కేనగర్ (తమిళనాడు)తో పాటు థీమజీ (అస్సాం), భోరంజ్ (హిమాచల్ ప్రదేశ్), అతెర్, బాంధవ్‌గఢ్ (మధ్యప్రదేశ్), కంతీదక్షిన్ (వెస్ట్ బెంగాల్), ధోల్‌పూర్ (రాజస్థాన్), నన్‌జన్‌గౌడ్, గుండ్లుపేట్ (కర్ణాటక) లతిపురా (జార్ఖండ్), ఉప్పేర్ బుర్‌తూక్ (సిక్కిం), రాజౌరీ గార్డెన్ (ఢిల్లీ) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. అలాగే జమ్మూ,కశ్మీర్‌లోని శ్రీనగర్, అనంత్‌నాగ్, కేరళలోని మలప్పురం పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.