సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరువారూర్ ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ పనులు నిలిపివేయాలంటూ ఈసీ సోమవారం ఆదేశాలు జారీచేసింది. జనవరి 28న తిరువారూర్ ఉప ఎన్నికల జరగాల్సి ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంతి, డీఎంకే అధినేత కరుణానిధి మృతితో తిరువారూర్ ఉపఎన్నికల అనివార్యమైన విషయం తెలిసిందే. అయితే తమిళనాడు వ్యాప్తంగా ఇటీవల సంభవించిన గజ తుపాను బాధితులకు అందాల్సిన పరిహారం ఇంకా అందలేదని, పూర్తి అయ్యే వరకు ఉప ఎన్నిక వాయిదా వెయ్యాలని పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.
బాధితులకు అందాల్సిన నష్టపరిహారం పంపిణీ పూర్తి అయ్యేంతవరకు ఉప ఎన్నికను వాయిదా వెయాలన్న అఖిలపక్షం డిమాండ్ మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. డీఎంకేతో సహా పలు పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. తిరువారుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కరుణానిధి ఆగస్టు 7న కన్నుమూసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment