నంద్యాలలో ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన
సాక్షి బృందం, నంద్యాల: ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదో రోజు రోడ్ షో ఆదివారం నంద్యాల పట్టణంలో ప్రారంభమైంది. శ్రీనివాస సెంటర్, వెంకప్ప అంగడిల మీదుగా బాలాజీ కాంప్లెక్స్, పైప్‌లైన్ రోడ్, సింగ్ కాలనీ, ఫరూక్‌నగర్, చౌరస్తా వరకు రోడ్‌షో కొనసాగుతోంది.
అక్కడి నుంచి ఫరూక్ నగర్, ఎన్‌ఆర్‌ఎస్ మూర్తి హాస్పిటల్, స్కావెంజర్స్, బాల్కొండహాల్, సంచిబట్టల సందు మీదుగా రోడ్‌షో కొనసాగనుంది. వెంకటేశ్వర దేవాలయం సెంటర్, గుడిపాటిగడ్డ సెంటర్, మేడం వారి వీధి, జుమ్మా మసీదు, గాంధీచౌక్‌ల మీదుగా కల్పనా సెంటర్, ఫళాని కూల్‌డ్రింక్స్ సందు, ముల్లాన్‌పేట వరకు రోడ్‌షో కొనసాగి, అనంతరం బైర్మల్‌వీధి, మున్సిపల్ హైస్కూల్ సెంటర్, చాంద్‌బాడ మీదుగా నిర్వహించనున్నారు.