న్యూఢిల్లీః తెలంగాణలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) షెడ్యూలు జారీచేసింది. ఈ షెడ్యూలు ప్రకారం ఈనెల 26న నోటిఫికేషన్ జారీకానుంది.
అక్టోబరు 3 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబరు 4న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థిత్వాల ఉపసంహరణకు అక్టోబరు 6 వరకు గడువు విధించారు. అక్టోబరు 17వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఈసీఐ తన షెడ్యూలులో ప్రకటించింది.
ఎన్నికకు షెడ్యూలు విడుదల చేసిన ఈసీ
Published Mon, Sep 19 2016 8:14 PM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
Advertisement
Advertisement