MLC position
-
ఎన్నికకు షెడ్యూలు విడుదల చేసిన ఈసీ
న్యూఢిల్లీః తెలంగాణలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) షెడ్యూలు జారీచేసింది. ఈ షెడ్యూలు ప్రకారం ఈనెల 26న నోటిఫికేషన్ జారీకానుంది. అక్టోబరు 3 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబరు 4న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థిత్వాల ఉపసంహరణకు అక్టోబరు 6 వరకు గడువు విధించారు. అక్టోబరు 17వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఈసీఐ తన షెడ్యూలులో ప్రకటించింది. -
సోమిరెడ్డికే ఎమ్మెల్సీ
►బీదకు అధ్యక్ష పదవి ఇవ్వటంతో లైన్‌క్లియర్ ►నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి నామినేషన్ ►సోమిరెడ్డి వర్గీయుల్లో ఆనందం.. ►బీద వర్గీయుల్లో నిరుత్సాహం సాక్షి ప్రతినిధి, నెల్లూరు : టీడీపీ జిల్లా నేతలను ఊరిస్తూ వస్తున్న ఎమ్మెల్సీ పదవికి అధినేత చంద్రబాబు పచ్చజెండా ఊపారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం సోమిరెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు. సోమిరెడ్డి పేరు ప్రకటించటంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ కోటా కింద, ఎమ్మెల్యేల కోటా కింద శాసనమండలి స్థానాలు భర్తీ చేయనున్నారు. వాటిలో ఒకదాని కోసం సోమిరెడ్డి, బీద పేర్లు జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ కమిటీ ఎన్నికల్లో బీద రవిచంద్రకు మరోసారి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో సోమిరెడ్డికి లైన్‌క్లియర్ అయింది. ఇదేస్థానాన్ని రవిచంద్ర కూడా ఆశించారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన పేరు అధిష్టానం ఖరారుచేసిందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే చివరిక్షణంలో అధినేత చంద్రబాబు జిల్లాకు మొండిచేయి చూపారు. దీంతో జిల్లా టీడీపీ నేతలు నిరుత్సాహానికి గురయ్యారు. లోపల అధినేతపై అసంతృప్తి ఉన్నా.. టీడీపీ శ్రేణులు ఎక్కడా బయటపడలేదు. తాజాగా మరోసారి శాసనమండలి స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వటంతో మరోసారి ఆశలు చిగురించాయి. రేసులో సోమిరెడ్డితో పాటు బీద పేరు వినిపించినా... తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రమోహన్‌రెడ్డి పేరు గవర్నర్ కోటా కింద ఖరారు చేశా రు. బీదకు అధ్యక్షపదవిని కట్టబెట్టటం, జిల్లాలో రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉండటంతో సోమిరెడ్డికే ఇవ్వాలని పలువురు పట్టుబట్టినట్లు తెలిసింది. సీనియారిటీ వైపే మొగ్గు టీడీపీలో సీనియర్ నేతగా పేరున్న సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డివైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. 1990లో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్‌గా ఆయన పనిచేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో సోమిరెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. క్రీడలు, సినిమాటోగ్రఫీ, యువజన సర్వీసులు తదిరతశాఖలకు రెండేళ్లపాటు మంత్రిగా పనిచేశారు. అనంతరం 2001 నుంచి 2004 వరకు సమాచారశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయ్యారు. కోవూరు ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిచెందారు. ఆ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఏడాది క్రితం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటవ్వటంతో ఎమ్మెల్సీపై ఆశలుపెట్టుకున్నారు. గవర్నర్, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాలో జరగుబోయే ఎన్నికల్లో ఏదో ఒకదాని నుంచి శాసనమండలికి ఎంపికై మంత్రి కావాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా గవర్నర్ కోటాలో సోమిరెడ్డి స్థానం దక్కించుకున్నారు. సోమిరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేయటంతో జిల్లాలో ఆయన వర్గీయులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. -
నమ్మకానికి పెద్దపీట
డీసీ గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖరారు సంబరాలు జరుపుకున్న అభిమానులు బద్వేలు(అట్లూరు) : మాజీ ఎమ్మేల్యే డీసీ గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖరారు కావడంతో బద్వేలు నియోజకవర్గంలోని ఆయన అనుచరులు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన గోవిందరెడ్డి, లక్షుమ్మ దంపతుల మొదటి సంతానం దేవసాని చిన్న గోవిందరెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబమైనప్పటికి చిన్నప్పటి నుండి గోవిందరెడ్డి చదువులో దిట్ట. డిప్యూటీ ట్రాన్సుపోర్ట్ కమిషనర్‌గా ఉద్యోగం చేస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల ఉండే అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ ఆశీస్సులతో 2004లో బద్వేలు ఎమ్మేల్యేగా గెలుపొందారు. తనదైన శైలిలో అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్‌కు సన్నిహితునిగా మెలిగారు. బద్వేలు నియోజకవర్గం 2009లో ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆ సీటును కమలమ్మకు కేటాయించారు. గెలుపు భారాన్ని తన భుజస్కందాలపై వేసుకుని కమలమ్మను గెలిపించారు. వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డికి మరింత చేరువయ్యారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరువీధి జయరాములును గెలిపించుకోవడంలో తనదైన శైలిలో కీలక పాత్ర పోషించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడిగా కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా శనివారం పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. -
ఇరకాటంలో ‘ద్వారపురెడ్డి’
ఆయనకు పదవి దక్కకుండా వ్యతిరేక వర్గీయుల తీవ్ర యత్నాలు ఆరోపణలను రుజువు చేసేందుకు యత్నం విజయనగరం మున్సిపాలిటీ : టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను పదవీ గండం వెంటాడుతోంది. తొమ్మిదేళ్ల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ తరఫున ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న ఆయనకు ఏ పదవీ దక్కకుండా ఆయన వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారు. ఐదేళ్లు గా జిల్లా టీడీపీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం అడ్‌హక్ కన్వీనర్‌గా కొనసాగుతున్నా రు. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి, ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు. ఇందుకోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ద్వారపురెడ్డి వ్యతి రేక వర్గీయులు మాత్రం ఆయనకు ఏ పదవీ లేకుండా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవి దేవుడెరుగు కానీ.. నిన్నటివరకు నిర్వహించిన పార్టీ అధ్యక్ష పదవి కూడా దక్కితే బాగుండనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన వ్య తిరేకులు మాత్రం ఎమ్మెల్సీ కాదు కదా జిల్లా అధ్యక్ష పదవి కూడా రానివ్వకుండా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ద్వారపురెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నారని, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశారని, ఉపాధి హామీ పథకం నిధుల మంజూరులో అధికారులను భారీస్థాయిలో మేనేజ్ చేయడంతో పాటు విద్యుత్ శాఖలో షిఫ్టు ఆపరేటర్, లైన్‌మన్ పోస్టుల భర్తీలో చేతి వాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే మంచి తరుణంగా భావించిన ఆయన వ్యతిరేకులు ఆయనపై ప్రస్తుతం వస్తున్న ఆరో పణలతో పాటు ఎన్నికల ముందు నుంచీ ఆయన వ్యవహరిస్తున్న వైఖరిని బయటపెట్టేందుకు ప్ర యత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రుజువులతో సహా పార్టీ అధిష్టానం, ముఖ్య నా యకుల వద్ద బయటపెట్టే ప్రయత్నంలో ఉన్నా రు. దీనిపై కిమ్మనే ధోరణి కాకుండా దూ కుడు ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఆయనకు ఏ పదవీ లేకుండా చేయలన్నదే వారి ముఖ్య ఉద్దేశంలా కనిపిస్తోంది. ఆ రెండు పదవులు చాలవా..? ద్వారపురెడ్డి జగదీష్ ప్రస్తుతం పార్వతీపురం మున్సిపల్ కౌన్సిలర్ పదవిలో ఉన్నారు. ఆయ న సతీమణి ద్వారపురెడ్డి శ్రీదేవి అదే మున్సి పాలిటీకి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ రెండు పదవులే ఆయన కుటుంబానికి ఎక్కువన్న చందంగా వ్యతిరేక వర్గీయులు భావిస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన వారు అనేక మంది పదవుల్లేక రాజకీయ నిరుద్యోగం అనుభవిస్తున్నట్టు ఉండాల్సి వస్తోందని, ఇటు వంటి సమయంలో ఆయనకు మరెన్ని పదవులు కావాలన్నదే వ్యతిరేక వర్గీయుల ఆలోచన. అయితే వ్యతిరేక వర్గీయులను ఓ పక్క నిలువ రించే ప్రయత్నం చేయడంతో పాటు పార్టీ ముఖ్యనేత , కేంద్రమంత్రి అశోక్‌తో పాటు పలువురు నేతల వద్ద జగదీష్ తన గోడును వెళ్లబుచ్చు కున్నట్లు తెలుస్తోంది. తనకు ఎమ్మెల్సీ పదవినైనా ఇవ్వాలని, లేకపోతే జిల్లా అధ్యక్షుని హోదాలోనైనా కొనసాగించాలని వేడుకున్నారని సమా చారం. ఎమ్మెల్సీ పదవుల కేటాయింపు రోజురోజుకు దూరమవుతున్న తరుణంలో పార్టీ అధ్యక్షుని పదవిపైనే ఆయన దృష్టి కేంద్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రతిపక్షాల నజర్
ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు మెజారిటీ లేకపోయినా పీఠం కోసం ప్రయత్నాలు హైదరాబాద్‌లో రహస్య సమావేశం టీఆర్ఎస్ తరఫున తెరపైకి టీఎన్జీవో నేత దేవిప్రసాద్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మూడేళ్లుగా ఖాళీగా ఉంటున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంపై ప్రతిపక్ష పార్టీలు కూడా కన్నేశాయి. స్థానిక సంస్థల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఏ ఒక్క పార్టీకి సొంతంగా గానీ, అన్ని పార్టీలు ఏకమై బరిలోకి దిగినా ఈ పీఠాన్ని గెలుచుకునేందుకు సరి పడా మెజారిటీ లేదు. అయినా.. ఈ స్థానం కోసం ప్రతిపక్ష పార్టీల నే తలు ఒకరిద్దరు తెరవెనుక పావులు కదుపుతున్నా రు. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులతోపాటు, అధికార పార్టీ సభ్యులకు కూడా భారీ మొత్తంలో నజరానాలు ఇచ్చి గట్టెక్కేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు మూడు ప్రతిపక్ష పార్టీల నేతలు కొందరు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. గతంలో కూడా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ లేకపోయినా, కాంగ్రెస్‌కు చెందిన ప్రేంసాగర్‌రావు ఇలాగే ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అప్పట్లో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కన్నా టీడీపీకి సుమారు 160 మంది సభ్యుల మెజారిటీ ఉండేది. అయినా కొందరు టీడీపీ సభ్యుల సహకారంతో కాంగ్రెస్ నుంచి ప్రేంసాగర్‌రావు గట్టెక్కారు. ఈసారీ అలాంటి ఎత్తుగడలు వేసేందుకు టీఆర్ఎస్యేతర పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగనుంది. చివరిసారిగా జిల్లాలోని స్థానిక సంస్థలకు 2007లో ఎన్నికలు జరిగాయి. గెలుపొందిన ప్రేంసాగర్‌రావుకు లాటరీలో ఆరేళ్ల పదవీ కాలం లభించింది. 2013తో ఆయన పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంటోంది. తెరపైకి దేవిప్రసాద్ పేరు.. అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున కొత్తగా టీఎన్జీవో నేత దేవిప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఆయనకు ఇచ్చిన హామీ మేరకు దేవిప్రసాద్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్‌కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత శ్రీహరిరావు కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీకి చెందిన తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు పురాణం సతీష్, లోక భూమారెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్ పేరు కూడా అధినేత పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపు అవకాశాలు పూర్తిస్థాయిలో ఉన్న జిల్లా నుంచి టీఎన్జీవో నేత దేవిప్రసాద్‌ను బరిలోకి దింపాలనే యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్కు అత్యధిక బలం.. వరుస ఎన్నికల్లో జిల్లాలో విజయ ఢంకా మోగించిన టీఆర్ఎస్ స్థానిక సంస్థలపై గులాబీ జెండాను ఎగురవేసింది. జిల్లా పరిషత్‌తోపాటు, భైంసా మినహా మిగిలిన ఐదు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే 52 మండలాల్లో 42కు పైగా మండల పరిషత్‌లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కొన్ని మండలాల్లో అసలు ప్రతిపక్ష పార్టీల ఉనికే లేకుండా పోయింది. పూర్తి మెజారిటీ ఉన్న టీఆర్ఎస్కు విజయావకాశాలున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు ఎప్పుడో పూర్తి చేసింది. ఈ స్థానిక సంస్థల జిల్లా ప్రజాప్రతినిధుల ఓటరు జాబితాను రెండు నెలల క్రితమే ఎన్నికల సంఘానికి పంపారు. -
పోటాపోటీ....ఎమ్మెల్సీ పదవి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఎమ్మెల్సీ పదవి కోసం టీఆర్ఎస్ పార్టీ నేతల్లో పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటి వరకు ఆ పార్టీ పశ్చిమ, తూర్పు జిల్లాల అధ్యక్షులు లోక భూమారెడ్డి, పురాణం సతీష్ మాత్రమే ఈ పదవి రేసులో ఉన్నారని అందరూ భావిస్తుండగా, ఈ ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ ఇతర నాయకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్ పేరు కూడా వినిపిస్తోంది. బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన ఆయనకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్టు దక్కలేదు. అనూహ్యంగా దుర్గం చిన్నయ్యకు టిక్కెట్ రాగా, ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం విధితమే. పార్టీని నమ్ముకుని ఉన్న ప్రవీణ్‌కు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ అప్పట్లో ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. అలాగే టీఆర్ఎస్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలెవరూ ఎమ్మెల్సీలుగా లేరు. దీంతో ప్రవీణ్‌కు కలిసొచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో బోథ్ ని యోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపట్టిన నేత గా ఉన్న రాములు నాయక్‌కు కూడా ఈ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అప్పట్లో రాములు నాయక్‌కు కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఇటీవల ఎమ్మెల్సీ పదవి దక్కిన విషయం విధితమే. అలాగే గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలైన ముఖ్య నాయకులు వేణుగోపాలచారి, కె.శ్రీహరిరావు కూడా ఈ పదవి కోసం తమవంతు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పరాజయం పాలైన చారీకి ఇప్పటికే కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా స్థానం కల్పించి క్యాబినేట్ హోదా ఇచ్చారు. అయితే.. మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలు తక్కువేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా పార్టీలో, ప్రభుత్వంలో ఎంతో కీలకంగా ఉన్న మంత్రి కేటీఆర్‌తో శ్రీహరిరావుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ మేరకు ఆయన కూడా ఈ పదవి రేసులో ఉంటారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వీరే కాకుండా ఎన్నికల సమయంలో చివరకు అనూహ్యంగా ఇతర నేతల పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్ల జాబితా సిద్ధం.. రాష్ట్రంలో ఆదిలాబాద్‌తోపాటు, మహబూబ్‌నగర్ జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కె.ప్రేంసాగర్ రావు పదవీకాలం 2013 మే 31తోనే ముగియగా, అప్పటి నుంచి ఈ పదవి భర్తీకి నోచుకోలేదు. మూడున్నర ఏళ్లుగా జెడ్పీ, మండల, మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడంతో ఈ పరిస్థితికి దారితీసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జెడ్పీ, మండల పరిషత్‌లకు, మున్సిపాలిటీలకు పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక తెరపైకి వచ్చింది. ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే ఈ స్థానిక సంస్థల నియోజకవర్గం ఓటర్ల జాబితాను సిద్దం చేశారు. ఓటర్ల పేర్లు, ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థ తదితర వివరాలతో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి కూడా పంపారు. జనవరిలో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు నేతలు ఇప్పటికే పలు సందర్భాల్లో అధినేత కేసీఆర్‌ను కలిసి తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.