
వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజం
బాబుది ‘యూజ్ అండ్ త్రో పాలసీ’ అని గతంలోనే చెప్పిన బావమరిది హరికృష్ణ
ఇప్పుడూ అదే తీరులో చంద్రబాబు
ఎమ్మెల్సీ ఇస్తానని పలువురు నేతలకు చంద్రబాబు హామీ.. ఎన్నికల్లో రకరకాలుగా పని చేయించిన బాబు
ఇప్పుడు వారందరికీ మొండిచేయి
వాడుకొని వదిలేశారని ఆశావహుల ఆవేదన
సాక్షి, అమరావతి: అవసరానికి వాడుకుని, ఆ తర్వాత వదిలేయడం చంద్రబాబు నైజం. ఇది అందరికీ తెలిసిన నిజం. ఎన్నోసార్లు ఎంతోమంది నేతలు కూడా ఈ విషయం విస్పష్టంగా చెప్పారు. ఆయన సొంత బావమరిది నందమూరి హరికృష్ణ కూడా చంద్రబాబుది ‘యూజ్ అండ్ త్రో పాలసీ’ అని ఓ సందర్భంగా గట్టిగానే చెప్పారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలోనూ చాలామందికి చంద్రబాబు ఏమిటో తెలిసొచ్చింది.
ఎన్నికల సమయంలో పని చేసేందుకు అనేక మందికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవులను ఎరగా వేశారు. సీట్లు సర్దుబాటు చేయలేని వారికి, నియోజకవర్గాల్లో పని చేయించుకోవాల్సిన వారికి, ఆరి్థకంగా ఆసరాగా ఉన్న వారికి ఆయన ఎడాపెడా హామీ ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చాక మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో పని చేయించుకున్నారు.
కొందరికైతే ఆ నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లోనే ప్రకటన కూడా చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక.. వారితో చంద్రబాబుకి పని లేకపోయింది. పదవులు, ఎమ్మెల్సీల ఎంపికలో పక్కన పెట్టేశారు. మారిన మనిషినంటూ చంద్రబాబు చేసిన ప్రకటనలతో కచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందని ఎదురుచూసిన నేతలంతా ఇప్పుడు హతాశులయ్యారు. చంద్రబాబు మాట ఇచ్చారంటే అది తప్పకుండా నెరవేర్చే అవకాశం ఉండదని తెలిసి వచ్చిందని వాపోతున్నారు.
ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశగా ఎదురుచూసి, బాబు కొట్టిన దెబ్బకు తెల్లమొహాలు వేసిన టీడీపీ ఆశావహుల జాబితా
శ్రీకాకుళం జిల్లా
1. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ
2. టీడీపీ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి
అల్లూరి సీతారామరాజు జిల్లా
1. మత్స్యరాస మణికుమారి
కాకినాడ జిల్లా
1. మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ
పశ్చిమ గోదావరి జిల్లా
1. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు
2. తాడేపల్లిగూడెం నియోజకవర్గ్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి
3. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి
4. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు
5. మాజీ మంత్రి పీతల సుజాత
6. ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు
ఏలూరు జిల్లా
1. పోలవరం మాజీ ఎమ్మెల్యే బొరగం శ్రీనివాస్
ఎన్టీఆర్ జిల్లా
1. దేవినేని ఉమామహేశ్వరరావు
2. నెట్టెం రఘురాం
3. వంగవీటి రాధాకృష్ణ
4. బుద్ధా వెంకన్న
5. నాగుల్ మీరా
పల్నాడు జిల్లా
1. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్
చిత్తూరు జిల్లా
1. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
2. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు
3. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు
అనంతపురం జిల్లా
1. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
2. మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్
3. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప
4. గుండుమల తిప్పేస్వామి
కర్నూలు జిల్లా
1. డోన్‌కు చెందిన ధర్మవరపు సుబ్బారావు
2. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment