ఇరకాటంలో ‘ద్వారపురెడ్డి’
ఆయనకు పదవి దక్కకుండా
వ్యతిరేక వర్గీయుల తీవ్ర యత్నాలు
ఆరోపణలను రుజువు చేసేందుకు యత్నం
విజయనగరం మున్సిపాలిటీ : టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను పదవీ గండం వెంటాడుతోంది. తొమ్మిదేళ్ల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ తరఫున ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న ఆయనకు ఏ పదవీ దక్కకుండా ఆయన వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారు. ఐదేళ్లు గా జిల్లా టీడీపీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం అడ్‌హక్ కన్వీనర్‌గా కొనసాగుతున్నా రు. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి, ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు. ఇందుకోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ద్వారపురెడ్డి వ్యతి రేక వర్గీయులు మాత్రం ఆయనకు ఏ పదవీ లేకుండా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవి దేవుడెరుగు కానీ.. నిన్నటివరకు నిర్వహించిన పార్టీ అధ్యక్ష పదవి కూడా దక్కితే బాగుండనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన వ్య తిరేకులు మాత్రం ఎమ్మెల్సీ కాదు కదా జిల్లా అధ్యక్ష పదవి కూడా రానివ్వకుండా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ద్వారపురెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నారని, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశారని, ఉపాధి హామీ పథకం నిధుల మంజూరులో అధికారులను భారీస్థాయిలో మేనేజ్ చేయడంతో పాటు విద్యుత్ శాఖలో షిఫ్టు ఆపరేటర్, లైన్‌మన్ పోస్టుల భర్తీలో చేతి వాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇదే మంచి తరుణంగా భావించిన ఆయన వ్యతిరేకులు ఆయనపై ప్రస్తుతం వస్తున్న ఆరో పణలతో పాటు ఎన్నికల ముందు నుంచీ ఆయన వ్యవహరిస్తున్న వైఖరిని బయటపెట్టేందుకు ప్ర యత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రుజువులతో సహా పార్టీ అధిష్టానం, ముఖ్య నా యకుల వద్ద బయటపెట్టే ప్రయత్నంలో ఉన్నా రు. దీనిపై కిమ్మనే ధోరణి కాకుండా దూ కుడు ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఆయనకు ఏ పదవీ లేకుండా చేయలన్నదే వారి ముఖ్య ఉద్దేశంలా కనిపిస్తోంది.
ఆ రెండు పదవులు చాలవా..?
ద్వారపురెడ్డి జగదీష్ ప్రస్తుతం పార్వతీపురం మున్సిపల్ కౌన్సిలర్ పదవిలో ఉన్నారు. ఆయ న సతీమణి ద్వారపురెడ్డి శ్రీదేవి అదే మున్సి పాలిటీకి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ రెండు పదవులే ఆయన కుటుంబానికి ఎక్కువన్న చందంగా వ్యతిరేక వర్గీయులు భావిస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన వారు అనేక మంది పదవుల్లేక రాజకీయ నిరుద్యోగం అనుభవిస్తున్నట్టు ఉండాల్సి వస్తోందని, ఇటు వంటి సమయంలో ఆయనకు మరెన్ని పదవులు కావాలన్నదే వ్యతిరేక వర్గీయుల ఆలోచన.
అయితే వ్యతిరేక వర్గీయులను ఓ పక్క నిలువ రించే ప్రయత్నం చేయడంతో పాటు పార్టీ ముఖ్యనేత , కేంద్రమంత్రి అశోక్‌తో పాటు పలువురు నేతల వద్ద జగదీష్ తన గోడును వెళ్లబుచ్చు కున్నట్లు తెలుస్తోంది. తనకు ఎమ్మెల్సీ పదవినైనా ఇవ్వాలని, లేకపోతే జిల్లా అధ్యక్షుని హోదాలోనైనా కొనసాగించాలని వేడుకున్నారని సమా చారం. ఎమ్మెల్సీ పదవుల కేటాయింపు రోజురోజుకు దూరమవుతున్న తరుణంలో పార్టీ అధ్యక్షుని పదవిపైనే ఆయన దృష్టి కేంద్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.