చంద్రబాబువి దెయ్యాల మాటలు: భూమన | YSRCP leader Bhumana slams AP CM chandrababu naidu on Nandyal By-poll | Sakshi
Sakshi News home page

చంద్రబాబువి దెయ్యాల మాటలు: భూమన

Published Tue, Aug 8 2017 7:51 PM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

చంద్రబాబువి దెయ్యాల మాటలు: భూమన - Sakshi

చంద్రబాబువి దెయ్యాల మాటలు: భూమన

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు రాజకీయ నికృష్టుడని ఆనాడే ఎన్టీఆర్‌ అన్నారని వైఎస్ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఔరంగజేబు లాంటి వాడని ఎన్టీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. వంగవీటి మోహనరంగాను నడిరోడ్డులో నరికించిన కుట్రదారుడు కూడా చంద్రబాబేనని అన్నారు. ఈ విషయాన్ని హరిరామజోగయ్య తన పుస్తకంలో రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారని చెప్పారు.

బాబు మాటలు దెయ్యాల మాటలని విమర్శించారు. ఆయన మాటలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగాలేరని, అధికారం కోసం నీచంగా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. వైఎస్ఆర్‌, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిలపై టీడీపీ కుట్రపూరిత దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. బాబు నిజస్వరూపం ఏంటనేది ఆయన్ను రాజకీయంగా పెంచి పోషించిన ఎన్టీఆరే చెప్పారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement