దమ్ముంటే ఉప ఎన్నికల్లో గెలవాలి | Komatireddy Venkat Reddy Challenges on by Elections CM KCR | Sakshi
Sakshi News home page

దమ్ముంటే ఉప ఎన్నికల్లో గెలవాలి

Published Fri, Mar 10 2017 3:20 AM | Last Updated on Mon, Oct 29 2018 8:31 PM

దమ్ముంటే ఉప ఎన్నికల్లో గెలవాలి - Sakshi

దమ్ముంటే ఉప ఎన్నికల్లో గెలవాలి

కేసీఆర్, బాబుకు సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి సవాల్‌

కనగల్‌:  ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుకు దమ్ముంటే కాంగ్రెస్, వైఎస్సార్‌ సీపీల నుంచి తమ పార్టీల్లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలవాలని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవా ల్‌ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కనగల్‌ మండల కేంద్రంలో నిర్వ హించిన కాంగ్రెస్‌ విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ గుర్తుతో గెలిచిన వారిని అప్రజాస్వామికంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న ఇద్దరు ఎంపీటీసీలను చిత్తుగా ఓడించి ప్రజలు నిజమైన తీర్పు ఇచ్చారన్నారు. కేసీఆర్‌ పతనం కనగల్‌ మండలం నుంచే ప్రారంభమైందని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో ఉప ఎన్నికల్లో చూపించారన్నారు. పొద్దున లేస్తే ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు.  రుణమాఫీ లేదు, డబుల్‌ బెడ్‌రూం ఊసేలేదు, దళితులకు మూడెకరాల భూమి లేదు ఇచ్చిన హామీలను విస్మరించి ఇప్పుడు గొర్రెలిస్తం బర్రెలిస్తం చివరకు పందులను ఇస్తం అంటూ సీఎం కొత్త రాగం అందుకున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement