ఏసీ గదుల్లో కాదు.. బయటకు వచ్చి చూడు | MLA Komatti Reddy fires on CM KCR | Sakshi
Sakshi News home page

ఏసీ గదుల్లో కాదు.. బయటకు వచ్చి చూడు

Published Sat, May 6 2017 2:22 AM | Last Updated on Mon, Oct 29 2018 8:31 PM

ఏసీ గదుల్లో కాదు.. బయటకు వచ్చి చూడు - Sakshi

ఏసీ గదుల్లో కాదు.. బయటకు వచ్చి చూడు

ప్రజల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి సవాల్‌

నల్లగొండ టౌన్‌: రూ.500 కోట్లతో ఏసీ భవంతిని నిర్మించుకుని అందులో ఉండి చూస్తే ఏమి తెలుస్తుంది.. బయటకు వచ్చి ప్రజల బాధలను చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌ చేశారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద విలేకరులతో మాట్లాడారు.

ఆస్పత్రుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో గవర్నర్‌ ప్రత్యక్షంగా చూశారని తెలిపారు. కాన్పుల వార్డులో బాలింతలను నేలపై పడుకోబెట్టడం చూసి గవర్నర్‌ చలించిపోయారని, వెంటనే బెడ్‌లను, బెడ్‌షీట్లను సాయంత్రంలోగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement