బీజేపీ ఓటమిని ఒప్పుకుంది : అఖిలేశ్‌ | The BJP had agreed to give up: Akhilesh | Sakshi
Sakshi News home page

బీజేపీ ఓటమిని ఒప్పుకుంది : అఖిలేశ్‌

Published Fri, Feb 17 2017 2:03 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీ ఓటమిని ఒప్పుకుంది : అఖిలేశ్‌ - Sakshi

బీజేపీ ఓటమిని ఒప్పుకుంది : అఖిలేశ్‌

మెయిన్ పురి: ఎన్నికల్లో ఓడిపోయామని బీజేపీ ముందే అంగీకరించిందని, అందుకే గతంలోని విషయాలను తిరగదోడుతోందని యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. 1984లో కాంగ్రెస్‌ నేతలు ములాయం సింగ్‌ యాదవ్‌పై హత్యాయత్నం చేసినా, ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవడం గురించి ప్రధాని మోదీ చేసిన విమర్శలపై గురువారం కర్హాల్‌లో జరిగిన ప్రచార సభలో అఖిలేశ్‌ దీటుగా సమాధానమిచ్చారు.

ఎప్పుడో జరిగిన విషయాల కంటే, ఫరియాబాద్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తమను యూపీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌ ఓడించిన విషయాన్ని మోదీకి ఆయన సలహాదారులు వివరించాల్సిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో పొత్తులో తన అనుభవలేమిని ప్రదర్శించారనే మోదీ విమర్శపై మాట్లాడుతూ.. సైకిల్‌ (ఎస్పీ ఎన్నికల గుర్తు) తొక్కడాన్ని తాను బాగా నేర్చుకున్నానని, తన వేగానికి దరిదాపుల్లో కూడా ఏనుగు (బీఎస్పీ గుర్తు) గాని, కమలం (బీజేపీ గుర్తు) గాని రాలేవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement