
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గోరఖ్‌పూర్, ఫూల్ఫూర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధిస్తుందని సీఎం యోగి ఆదిత్యానాథ్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య రాజీనామా చేయడంతో ఈ లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి ఎజెండాగా సాగుతున్న మోదీ పరిపాలనకు ప్రజలు మరోసారి పట్టం కడతారని, 2019 ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటాయని ఆయన అన్నారు.
ఈ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. నెగిటివ్ మైండ్‌సెట్ కలిగిన రాహుల్‌గాంధీ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతోందని ఎద్దేవా చేశారు. ‘నేను ప్రధాని అయితే.. పెద్దనోట్ల రద్దు ఫైల్‌పై సంతకం పెట్టకుండా.. చెత్తకుప్పలో వేసేవాడిని’ అన్న రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన అభ్యర్థననే ప్రజలు చెత్తకుప్పలో వేస్తారని వ్యాఖ్యానించారు.