ఉత్తరప్రదేశ్‌ బీజేపీలో విభేదాలు | Rift in UP BJP over Yogi photo on tickets for Sapna event | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్‌ బీజేపీలో విభేదాలు

Published Mon, Feb 12 2018 6:19 PM | Last Updated on Mon, Feb 12 2018 6:19 PM

Rift in UP BJP over Yogi photo on tickets for Sapna event - Sakshi

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ప్రముఖ డాన్సర్‌ సప్నా

కాన్పూర్‌, ఉత్తరప్రదేశ్‌ : హర్యాన్వీ డ్యాన్సర్‌ సప్నా చౌదరి ఈవెంట్‌ టికెట్లపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఫొటో ముద్రించడంపై ఉత్తరప్రదేశ్‌ బీజేపీలో వివాదం రాజుకుంది. రాష్ట్ర బీజేపీ నేత నీలిమా కటియార్‌, బీజేపీ చీఫ్‌ సురేంద్ర మైథాని ఈవెంట్‌ టికెట్లపై యోగి ఆదిత్యనాథ్‌ ఫొటోను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే, ఆ పార్టీకే చెందిన కాన్పూర్‌ మేయర్‌ మాత్రం ఈవెంట్‌ టికెట్లపై ముఖ్యమంత్రి ఫొటోను ముద్రించడాన్ని సమర్థించారు. చెప్పుకునేంత పెద్ద విషయం కాకపోయినా మీడియానే టికెట్ల విషయాన్ని పెద్దది చేసి చూపుతోందని ఆరోపించారు. స్వయంగా ఈవెంట్‌ను ప్రారంభించారు.

టికెట్లు లేకుండా ఈవెంట్‌లోకి వెళ్లేందుకు పలువురు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో భద్రతగా ఉన్న పోలీసులు వారిపై లాఠీ చార్జ్‌ చేశారు. దీంతో ఆగ్రహించిన కొందరు పార్క్‌ చేసి ఉన్న వాహనాలపై రాళ్ల దాడికి దిగారు. కాగా, ఈ కార్యక్రమాన్ని కాన్పూర్‌కు చెందిన ఓ డాక్టర్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది.

కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి చేతులు మీదుగా అవార్డు అందుకున్నందుకు ఆయన ఈవెంట్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ అధికారులకు, ప్రముఖులకు ఈవెంట్‌కు పెద్ద ఎత్తున ఉచితంగా టికెట్లు అందజేసినట్లు తెలిసింది. సాధారణంగా టికెట్లు భారీగా అమ్ముడుపోయినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement