Sapna Chaudhary
-
వైరల్: హర్యానా రాణితో ముసలాయన స్టెప్పులు.. తగ్గేదేలే!
డ్యాన్స్ అంటే ఎక్కడా లేని హుషారు వస్తుంది. తెలియని ఉత్సాహం ఉరకలేస్తోంది. ఎంత డ్యాన్స్ రాని వారైనా కాళ్లు చేతులు కదుపుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే డ్యాన్స్‌ను ఫ్యాషన్‌గా భావించి., తమలోని టాలెంట్‌ను నిరూపించేందుకు నిరంతరం తాపత్రయ పడేవారు కొందరైతే మరికొందరు అందరి మధ్య డ్యాన్స్ చేసేందుకు సిగ్గు పడుతుంటారు. తాజాగా ఓ వృద్ధుడు తన వయసును మర్చిపోయి వేలాది మంది ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశాడు. సప్నా చౌదరి... హర్యానా రాణిగా ఆమె పాపులర్. ఎప్పుడూ డ్యాన్స్ వీడియోలతో అలరించే సప్నాకు మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సప్నా చౌదరికి చెందిన ఓ పాత వీడియో తాజాగా మరోసారి వైరలవుతోంది. మూడు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో వేలాది మంది ముందు స్టేజ్‌పై సప్నా హర్యాన్వి పాటకు డ్యాన్స్ చేస్తోంది. చుట్టు ఉన్న జనాలు చప్పట్లతో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతలో స్టేజ్ ముందు కూర్చున్న ఓ ముసలాయన లేచి డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. చదవండి: మా ఆయన బంగారం! విడాకులిస్తాడనుకుంటే.. రూ. 5 కోట్ల విలువైన కోటను గిఫ్ట్‌గా ఇచ్చాడు! ఏ మాత్రం మోహమాటపడకుండా ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. సప్నాకు ఎదురుగా నిలబడి దూరం నుంచి హుషారైన స్టెప్పులతో ఏజ్ ఇజ్ జస్ట్ ఏ నంబర్ అని నిరూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు మూడు మిలియన్ల వ్యూమ్స్ సంపాదించింది. చదవండి: నెటిజన్ తలతిక్క ప్రశ్న..దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఆనంద్ మహీంద్రా -
ప్రముఖ డ్యాన్సర్‌పై చీటింగ్ కేసు.. అరెస్టు వారెంట్ జారీ
ప్రముఖ డ్యాన్సర్ సప్నా చౌదరి వివాదంలో చిక్కుకుంది. ఒక ప్రోగ్రామ్‌ను రద్దు చేసి, టిక్కెట్ హోల్డర్లకు డబ్బులు తిరిగి ఇవ్వలేదనే ఆరోపణలపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శంతను త్యాగి బుధవారం చౌదరిపై వారెంట్ జారీ చేశారు. కేసు తదుపరి విచారణ తేదీ అయిన నవంబర్ 22 లోగా దీనిని అమలు చేయాలని పోలీసులను కోరారు. సప్నా చౌదరి గతంలో కూడా ఆమెపై ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది అయితే కోర్టు దీనిని తిరస్కరించింది. అసలేం జరిగిందంటే.. 2018 అక్టోబర్ 13న లక్నోకు చెందిన సప్నా చౌదరితో డ్యాన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె టీం డబ్బులు వసూలు చేసింది. షో తిలకించేందుకు వేలాది మంది ప్రజలు కూడా తరలివచ్చారు. అయితే ఆ రోజు చౌదరి రాత్రి 10 గంటల వరకు రాలేదు, దీంతో షో రద్దు అయ్యింది. కార్యక్రమం రద్దు కావడంతో జనం అక్కడికక్కడే తోపులాట సృష్టించారు. షో జరగకపోయినా యాజమాన్యం తీసుకున్న రూ.300 టికెట్ సొమ్మును ప్రజలకు తిరిగి ఇవ్వలేదు. దీంతో టికెట్ కొన్న కొందరు ఆమెపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ డ్యాన్సర్‌తో పాటు, ప్రోగ్రామ్ నిర్వాహకులు జునైద్ అహ్మద్, నవీన్ శర్మ, ఇబాద్ అలీ, అమిత్ పాండే, రత్నాకర్ ఉపాధ్యాయ్‌ల పేర్ల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. చదవండి: Repeal of farm laws:మోదీకి షాకిచ్చిన కంగనా, వివాదాస్పద వ్యాఖ్యలు -
బీజేపీలో చేరిన గాయని సప్నా చౌదరి
సాక్షి, ఢిల్లీ: హరియాణా పాపులర్ సింగర్, డాన్సర్ సప్నా చౌదరి ఎట్టకేలకు అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం ఢిల్లీలోని జవహర్ లాల్ స్టేడియంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆమె పార్టీ తొలి సభ్యత్వం తీసుకున్నారు. బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్... సప్నా చౌదరికి కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ జనరల్ సెక్రటరీ రాంలాల్, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ తదితరులు పాల్గొన్నారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. సింగర్, డ్యాన్సర్‌గానే కాకుండా బిగ్ బాస్ 11 సీజన్లో పాల్గొన్న సప్నా చౌదరికి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ఊహాగానాలు వచ్చినా...అనూహ్యంగా బీజేపీకి చేరువ అయ్యారు. చదవండి: కాంగ్రెస్‌కు షాక్.. సప్నా చౌదరీ యూటర్న్..! ‘డ్యాన్స్ వస్తే చాలు.. కాంగ్రెస్‌లో ఛాన్స్’ -
ఢిల్లీ మహిళా పోలీసులు స్టెప్పులు
-
వైరల్ వీడియో : మహిళా పోలీసులా మజాకా..!
న్యూఢిల్లీ : హర్యానాకు చెందిన ప్రముఖ సింగర్ కమ్ డ్యాన్సర్ సప్నా చౌదరి అంటే తెలియని వారుండరు. ఆమె పాటల్లో ‘తేరి ఆఖోంకా ఏ కాజల్’ చాలా ఫేమస్. ఎంతలా అంటే యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను ఇప్పటికే 380 మిలియన్ల మంది చూశారు. ఇప్పుడు ఇదే పాటకు ఢిల్లీ మహిళా పోలీసులు అదిరిపోయే స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత నెల 30న సౌత్ వెస్ట్ ఢిల్లీ పోలీసులు ‘సునో సహెలీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దానిలో భాగంగా సప్నా చౌదరి ‘తేరి ఆఖోంకా ఏ కాజల్’ పాటను ప్లే చేశారు. ఇంకేముంది ఓ ముగ్గురు, నలుగురు మహిళా పోలీసు అధికారులు స్టేజీ మీదకు ఎక్కి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అంతటితో ఊరుకోక ఐపీఎస్ అధికారిణి బెనిటా మారి జైకర్ను కూడా తమతో పాటు స్టేజీ మీదకు లాకెళ్లారు. దీన్ని స్పోర్టీవ్‌గా తీసుకున్న ఐపీఎస్ అధికారిణి కూడా మిగతా వారితో కలిసి స్టెప్పులేసింది. డ్యాన్సర్, సింగర్ అయిన సప్నా చౌదరికి హర్యానాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే బిగ్‌బాస్ షోలో పాల్గొనడంతో ఆమె గురించి దేశం అంతా తెలిసింది. గత ఏడాది గూగుల్‌లో అత్యధిక మంది సర్చ్ చేసింది కూడా సప్నా చౌదరి గురించేనట. -
కాంగ్రెస్‌కు షాక్.. సప్నా చౌదరీ యూటర్న్..!
చంఢీగడ్ : హరియాణా పాపులర్ సింగర్, డాన్సర్ సప్నా చౌదరీ యూటర్న్ తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆదివారం వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. మధుర నియోజకవర్గంలో బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్, సిట్టింగ్ ఎంపీ హేమమాలినిపై సప్నా చౌదరిని నిలబెట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహమని ప్రచారం జరిగింది. అయితే, తాను కాంగ్రెస్‌లో చేరలేదనీ, అసలు ఏ పార్టీ తరఫునా పోటీ కూడా చేయట్లేదని, ప్రియాంక గాంధీతో ఉన్న ఫోటో కూడా పాతదని ఆమె ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. దీంతో కాంగ్రెస్ ఆమె పార్టీలో చేరేందుకు ఫారం నింపుతున్న ఓ వీడియోను బయటపెట్టడంతో అది వైరల్ అయ్యింది. ‘ఆమె స్వయంగా శనివారం నాడు పార్టీ ఆఫీసుకొచ్చి ఫారం నింపి వెళ్లారు. ఆమె సోదరి కూడా కాంగ్రెస్‌లో చేరారు’ అని యూపీసీసీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర రథి ప్రకటించారు. (‘డ్యాన్స్ వస్తే చాలు.. కాంగ్రెస్‌లో ఛాన్స్’) ఇదిలాఉండగా... ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీతో సప్న భేటీ అయ్యారనే వార్తలు కాంగ్రెస్‌ను కలవరానికి గురిచేస్తున్నాయి. ఆమె యూటర్న్ తీసుకుని బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ప్రియాంక గాంధీని కలిసిన కొద్ది గంటలకే ఆమె తివారీతో సమావేశమయ్యారు. అక్కడా.. ఇక్కడా.. ఆమె అవే దుస్తుల్లో దర్శనమివ్వడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. ‘సప్న సంతకాన్ని కాంగ్రెస్ ఫోర్జరీ చేసింది. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ఆమెకు సంబంధించిన వీడియా అసత్యం. ఆ ఫారం 2011-15 మధ్య కాలానిది’’ అని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. -
‘డ్యాన్స్ వస్తే చాలు.. కాంగ్రెస్‌లో ఛాన్స్’
చండీగఢ్ : తనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అశ్వినీ కుమార్ చోప్రాకు, హర్యానా సింగర్ కమ్ డాన్సర్ సప్నా చౌదరి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘నా డ్యాన్స్ పోగ్రామ్స్ చూస్తున్నందుకు అశ్వినీ కుమార్‌కు ధన్యవాదాలు, అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మీ మానసిక స్థితి ఎలా ఉందో అర్థమైపోతోంది’ అంటూ సప్నా చౌదరి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే నా కర్తవ్యం. ఇకపై కూడా నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించేందుకు నేను ఏమాత్రం వెనుకాడబోను. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు’ అంటూ ఆమె స్పష్టం చేశారు. అయినా వయసులో తన కంటే పెద్దవారి నుంచి క్షమాపణలు కోరడమనేది సంస్కారం అనిపించుకోదన్నారు. అసలు విషయమేమిటంటే.... సింగర్, డ్యాన్సర్‌గా సప్నా చౌదరికి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. సప్నా చౌదరితో క్యాంపెయిన్ నిర్వహించేందుకు ఆసక్తి చూపుతోందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సప్నా చౌదరి, యూపీఏ చీఫ్ సోనియా గాంధీని కలిసేందుకు గత శుక్రవారం ఢిల్లీకి వెళ్లడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతోందనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అశ్వినీ కుమార్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ... ‘డ్యాన్స్ చేయడం వస్తే చాలు కాంగ్రెస్ పార్టీలో సెటిల్ అవ్వొచ్చు అనుకునే వారు చాలా మందే ఉన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే డ్యాన్సర్లు ఎక్కువైపోయారు. అసలు ఆ పార్టీ ఏం కోరుకుంటోంది...? ఎన్నికల్లో గెలవాలనా లేదా డ్యాన్సర్లతో పార్టీని నింపేయాలనా’ అంటూ వ్యాఖ్యానించారు. -
ఉత్తరప్రదేశ్ బీజేపీలో విభేదాలు
కాన్పూర్, ఉత్తరప్రదేశ్ : హర్యాన్వీ డ్యాన్సర్ సప్నా చౌదరి ఈవెంట్ టికెట్లపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫొటో ముద్రించడంపై ఉత్తరప్రదేశ్ బీజేపీలో వివాదం రాజుకుంది. రాష్ట్ర బీజేపీ నేత నీలిమా కటియార్, బీజేపీ చీఫ్ సురేంద్ర మైథాని ఈవెంట్ టికెట్లపై యోగి ఆదిత్యనాథ్ ఫొటోను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఆ పార్టీకే చెందిన కాన్పూర్ మేయర్ మాత్రం ఈవెంట్ టికెట్లపై ముఖ్యమంత్రి ఫొటోను ముద్రించడాన్ని సమర్థించారు. చెప్పుకునేంత పెద్ద విషయం కాకపోయినా మీడియానే టికెట్ల విషయాన్ని పెద్దది చేసి చూపుతోందని ఆరోపించారు. స్వయంగా ఈవెంట్‌ను ప్రారంభించారు. టికెట్లు లేకుండా ఈవెంట్లోకి వెళ్లేందుకు పలువురు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో భద్రతగా ఉన్న పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కొందరు పార్క్ చేసి ఉన్న వాహనాలపై రాళ్ల దాడికి దిగారు. కాగా, ఈ కార్యక్రమాన్ని కాన్పూర్‌కు చెందిన ఓ డాక్టర్ నిర్వహించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి చేతులు మీదుగా అవార్డు అందుకున్నందుకు ఆయన ఈవెంట్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ అధికారులకు, ప్రముఖులకు ఈవెంట్‌కు పెద్ద ఎత్తున ఉచితంగా టికెట్లు అందజేసినట్లు తెలిసింది. సాధారణంగా టికెట్లు భారీగా అమ్ముడుపోయినట్లు సమాచారం.