టీడీపీ అధికార దుర్వినియోగం | Tdp govt using DRDA officers for election campaign | Sakshi
Sakshi News home page

టీడీపీ అధికార దుర్వినియోగం

Published Sat, Aug 12 2017 4:05 PM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

టీడీపీ అధికార దుర్వినియోగం - Sakshi

టీడీపీ అధికార దుర్వినియోగం

నంద్యాల: ఉప ఎన్నికలో గెలుపుకోసం తెలుగుదేశం ప్రభుత్వం వక్రమార్గాలను అన్వేషిస్తోంది. ప్రతి రోజు కొత్త మార్గాలను వెతుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగులను సైతం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని చూస్తోంది. తెలుగుదేశానికి ఓటు వేయకపోతే పింఛన్‌లతో పాటు ఏప్రభుత్వ పథకాలను అందివ్వబోమని బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల 31 వార్డులో ఓటర్లను ప్రలోభ పెడుతూ తెలుగుదేశం నేతలు మీడియాకు చిక్కారు.  మరోవైపు పారిశుధ్యకార్మికులను సైతం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. ఓటర్ల ఇంటి ముందు చెత్త ఊడ్చేసి తెలుగుదేశానికి ఓటు వేయాలని చెప్పడం వంటి పనులు కూడా చేశారు.
 
తాజాగా తెలుగుదేశం నేతలు మరో అడుగు ముందుకేశారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రచారం కోసం డీఆర్‌డీఏ అధికారులను రంగంలోకి దించారు. జిల్లా నలుమూలల నుంచి డీఆర్‌డీఏ, సీఆర్‌పీ అధికారలను నంద్యాలకు పిలిపించారు. వచ్చి రాగానే అధికారులు స్వామి భక్తి నిరూపించుకొనే పనిలో పడ్డారు. తెలుగుదేశానికి ఓటు వేయాలని మహిళా సంఘాలపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు డీఆర్‌డీఏ అధికారలు నిర్వాకంపై ఆధారాలతో సహా ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. మేరకు అధికార​ దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement