వరంగల్ అర్బన్: గ్రేటర్ పరిధిలోని 44వ డివిజన్ ఓటర్లు తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది. ఉపఎన్నిక బరిలో నిలిచిన రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల భవిష్యత్ తేల్చేందుకు ఓట ర్లు సిద్ధమయ్యారు. డివిజన్‌లో హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు, నాయకులు.. ఓటర్ల స్పందన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరి నిమిషంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయ ంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
ఈవీఎంలతో పోలింగ్‌స్టేషన్లకు..
గ్రేటర్ ప్రధాన కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూం నుంచి పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, తదితర సామగ్రిని పంపిణీ చేశారు. ప్రత్యేక బస్సులో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం మొత్తం తొమ్మిది ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 9,641 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హన్మకొండ నయీంనగర్‌లోని తేజస్వీ హైస్కూల్‌లో మూడు ఈవీఎంలు, తేజస్వీ హైస్కూల్ 2వ బ్లాక్‌లో నాలుగు ఈవీఎంలు, ఏకశిల హైస్కూల్‌లో రెండు ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తేజస్వీని హైస్కూల్ 2వ బ్లాక్‌లో మూడో తరగతి గదిలో 1,298 మంది ఓటర్లు, ఇదే స్కూల్‌లోని ఐదో తరగతి గదిలో 915 మంది ఓటర్లు తమ ఓటను వినియోగంచుకోనున్నారు.
⇒ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్య మాక్ పోలింగ్
⇒ పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
⇒ రిజర్వేషన్– జనరల్
⇒ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థులు ఇద్దరు
⇒ పోలింగ్ సిబ్బంది–40 మంది
⇒ ప్రతి పోలింగ్ బూత్‌లో ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడిగ్ అధికారి, ఇద్దరు చొప్పన సహాయకులు
⇒ రిజర్వులో నలుగురు సిబ్బంది
⇒ పోలింగ్‌లో అభ్యర్థికి ఒక ఎజెంట్ చొప్పన రెండు పార్టీల అభ్యర్థులకు ఇద్దరు
⇒ ఇద్దరు రూట్ ఆఫీసర్లు, ఒకరు జోనల్ ఆఫీసర్
⇒ ఉప ఎన్నిక కంట్రోల్ రూం ఇండోర్ స్టేడియం
⇒ ఎన్నికల విధుల్లో 50 మంది గ్రేటర్ సిబ్బంది
⇒ రెండు గంటలకోసారి పోలింగ్ శాతం వెల్లడి
⇒ శాంతి భద్రతల కోసం పోలింగ్ కేంద్రానికో ఎస్కార్టు
⇒ నిఘా కోసం వీడియోగ్రాఫర్‌ను నియమించారు.
ఓటు హక్కును వినియోగించుకోవాలి..
44వ డివిజన్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి కరుణాకర్ తెలిపారు. సోమవారం గ్రేటర్ ఇండోర్ స్టేడియంలో పోలింగ్ సిబ్బందికి ఈవీఎం, స్టేషనరీ పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉపఎన్నికకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ నాగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ బ్రహ్మయ్య, సీపీ శ్యాంకుకమార్, ఈఈ లింగమూర్తి, ఏఆర్‌ఓలు పారిజాతం, శ్రీవాణి, పర్యవేక్షకులు ప్రసన్నారాణి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఉప ఎన్నిక డివిజన్ 44
పోలింగ్ కేంద్రాల సంఖ్య 3
పోలింగ్ బూత్‌లు 9
డివిజన్‌లోని మొత్తం ఓటర్ల సంఖ్య 9,641
మహిళా ఓటర్లు 4,648
పురుష ఓటర్లు 4,993
మొత్తం ఓటర్లు 9,641
ఈవీఎంలు 9
Comments
Please login to add a commentAdd a comment