పెన్షన్.. టెన్షన్
పెన్షన్.. టెన్షన్
Published Thu, Jan 5 2017 10:40 PM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM
పీఎఫ్ పింఛనుదారులకూ ఇబ్బందులే
వేలిముద్రలు, ఐరీష్ కోసం పరుగులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : కొత్తగా ప్రవేశపెట్టిన వేలిముద్ర, ఐరీష్ వి«ధానం కారణంగా ప్రావిడెంట్ ఫండ్ నుంచి పెన్షన్ పొందుతోన్న ఉభయగోదావరి జిల్లాల్లోని పెన్షన్‌దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేటు సంస్థల్లో రిటైరై ఈ పెన్షన్ తీసుకునే వారు ఏడాదికోసారి లైవ్ సర్టిఫికెట్ సమర్పించాల్సివచ్చేది. ఈ ఏడాది నుంచి ఆ విధానానికి స్వస్తి పలికి వేలిముద్రలుంటేనే పెన్షన్ వచ్చేలా మార్పు చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 54 ,607 మంది ఈ పెన్షన్లు పొందుతున్నారు. ఇప్పటికి 23,418 మంది మాత్రమే వేలిముద్రలను నమోదు చేసుకున్నారు. వేలిముద్రలు సరిగా పడని వృద్ధులకు ఐరీష్ తీసుకుంటున్నారు. ఈ విషయం తెలియని వారు లైవ్ సరిఫ్టికెట్‌తో ఎప్పటిలానే పంపుతున్నారు. వేలిముద్రలు వేయకుండా ధ్రువపత్రం పంపిన వారికి పెన్షన్లు ఆగిపోతాయని అధికారులు చెబుతున్నారు. ఈ వి«ధానం గతేడాది నవంబర్ నెల నుంచి ప్రారంభించినా.. ఈ నెల నుంచి అమలుకానుంది.
అంతా 60 ఏళ్లు పైబడిన వారే..
ఈపీఎస్ పొందేవారిలో అత్యధిక శాతం 60 ఏళ్లు పైబడినవారే. వేలిముద్రల నమోదు చేయించుకునేందుకు వారు ఉభయగోదావరి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నారు. జిల్లా పరిధిలో రాజమహేంద్రవరం, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరంలోని పీఎఫ్ కార్యాలయాలకు వీరు వెళుతున్నారు.
పనిచేయని స్థానిక కేంద్రాలు
పెన్షన్‌దారుల రద్దీ దృష్ట్యా, ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రధాన మండలాల్లో వేలిముద్రల నమోదు చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తులతో స్థానిక కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ పనిచేయక, మరికొన్ని సెంటర్లలో వేలిముద్రలు నమోదు కాక, ఇతర సాంకేతిక సమస్యలతో ఈ కేంద్రాలు పనిచేయడం లేదు. దీంతో పెన్షన్‌దారులను జిల్లాలోని ప్రధాన కేంద్రాలకు వెళ్లమని ఈ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో పెన్షన్‌దారులు అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రాలకు వెళ్లడం కష్టమని,
ఈ కేంద్రాల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించి ఇక్కడే వేలిముద్రల నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని పెన్షన్‌దారులు కోరుతున్నారు.
చాలా దూరం నుంచి వచ్చా..
వేలిముద్ర వేయకపోతే పెన్షన్ ఆగిపోతుందంటున్నారు. ఆరోగ్యం బాగోకపోయినా హడావుడిగా వచ్చేశాను. ఇంతదూరం రావడం కష్టంగా ఉంది. స్థానికంగా ఏర్పాటు చేసిన సెంటర్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి.
–సత్యనారాయణ, శృంగవృక్షం
అందరూ నమోదు చేసుకోవాలి
ఈపీఎస్ పొందేవారు కచ్చితంగా వేలిముద్ర వేసి వారి సమాచారాన్ని పొందుపర్చాలి. లేకపోతే పెన్షన్ ఆగిపోతుంది. ఈ నెల 10వ తేదీలోగా ఈ నమోదు ప్రక్రియ పూర్తి కావాలి. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఇబ్బందులు ఉంటే నేరుగా తమ కార్యాలయానికి తెలియజేయవచ్చు. స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లేముందు ఫోన్ చేసి అక్కడ పనిచేస్తుందో లేదో తెలుసుకుని వెళ్లండి. లేనిపక్షంలో ప్రధాన కార్యాలయానికి రావాల్సిందే.
–కె.గణేష్‌కుమార్ జానీ, రీజినల్ పీఎఫ్ కమిషనర్
ఈపీఎఫ్ వేలిముద్రల నమోదు సెంటర్ల ఫోన్ నెంబర్లు
తూర్పుగోదావరి జిల్లా
సఖినేటిపల్లి, మోరి 94912 40130
జగన్నాయకపూర్ 98484 92002
మమ్ముడివరప్పాడు 99496 28107
జి.రంగంపేట 77023 22084
పిఠాపురం 90595 49906
సర్పవరం, కాకినాడ 91549 62076
బండారులంక, అమలాపురం 81259 83849
చీడిగ 93468 22647
ముక్కామల 98851 62355
నెల్లి అప్పన్నసెంటర్ 99592 78659
గోకవరం 93970 80300
కొత్తపేట 91775 45958
మొల్లేరు 94408 00882
మలికిపురం 98493 81195«
ధవళేశ్వరం 92461 11809
రాజమండ్రి 94401 27694
బిక్కవోలు 92915 80865
అంగర 99590 18900
వెదురుపాక 98496 56084
కొండకుదురు 89788 72722
ఇంజరము 94921 79933
తాటిపాక 99129 75759
వేమగిరి 98854 75701
రంపచోడవరం 94902 46563
Advertisement