ఓటు వేయడానికి వస్తున్న వృద్ధరాలు
కొండపాక: వెలికట్ట ఎంపీటీసీ ఉప ఎన్నిక పుణ్యమా అని 90 ఏళ్ల బాలవ్వ అనే వృద్ధురాలు ఓటేసి ఓటు విలువను తెలియజేసింది. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాని బాలవ్వ ‘ బిడ్డా నేను బతికున్న సమయంలో వచ్చిన ఓటు హక్కును వినియోగించుకుంటానని పక్కింటి లక్ష్మితో చెప్పగానే ఆలోచించకుండా లక్ష్మి బాలవ్వను పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్లి ఓటు వేయించి ఇంటికి తీసుకవెళ్లింది.