
కర్ణాటక / కేజీఎఫ్ : నగరంలోని ఎన్‌టి బ్లాక్ వార్డు నెంబర్ 17కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి అన్బరసి కేవలం 4 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత సభ్యురాలు అనిత రాజీనామాతో ఖాళీపడిన వార్డు కౌన్సిలర్ స్థానానికి ఈ నెల 18న ఉప ఎన్నిక నిర్వహించారు. బుధవారం జరిగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అన్బరసి విజయం సాధించారు. కోలారు ఉప విభాగాధికారి శుభాకళ్యాణ్ గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి అన్బరసికి ప్రమాణ పత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment