![Bypolls on local issues, it'll be Modi again in 2019 - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/1/sambit.jpg.webp?itok=m3nw-PWz)
సంబితా పాత్రా
న్యూఢిల్లీ: ఉప ఎన్నికల్లో ఓటమిని బీజేపీ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసింది. ఉప ఎన్నికల్లో ప్రజలు ప్రధాని, సీఎంలను ఎన్నుకోరని, స్థానిక సమస్యలే ప్రభావం చూపుతాయని ఆ పార్టీ పేర్కొంది. అయినా మోదీ హవాతో 2019 ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. యూపీ, మహారాష్ట్రాల్లో సిట్టింగ్ సీట్లను కోల్పోవడంపై విశ్లేషణ జరుపుతామని తెలిపింది.
జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ సహాయక పాత్రకు దిగజారిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబితా పాత్రా ఎద్దేవా చేశారు. ప్రధాని కావాలంటే పనితీరు, కష్టపడేతత్వం అవసరమని, అవి ప్రధాని మోదీలో ఉన్నాయని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 2014 నాటి కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు దేశ, రాష్ట్రాల రాజకీయాలపై ప్రభావం చూపవని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment