కోర్టు తీర్పుతో మళ్లీ మీ మధ్యకు వస్తా
కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ
హసన్‌పర్తి : ఆరునెలల్లో వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నికలు వస్తాయని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 54వ డివిజన్ దేవన్నపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో అవకతవకలు జరిగాయని కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు. త్వరలోనే తనుకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని ఆరోపించారు. ఉప ఎన్నిక వస్తే మళ్లీ తానే కాంగ్రెస్ అభ్యర్థినని చెప్పారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఝలక్ ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ నోటి నుంచి వస్తున్న ప్రతి మాటా అబద్ధమేనన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క పథకాన్నీ ప్రవేశపెట్టలేదన్నారు. 87 వేల మంది గౌడకులస్థులు ఉన్నా ఆ వర్గానికి గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు.
మడికొండ : కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సర్వే సత్యనారాయణ అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో భాగంగా 34వ డివిజన్ అభ్యర్ధి మేకల ఉపేందర్‌కు మద్దతుగా శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ కృషి తోనే తెలంగాణ రాలేదని, ఎందరో ఉద్యమకారుల పోరాటం, సోనియాగాంధీ చొరవ వల్లే వచ్చిందని అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మాజీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నెరెళ్ల శారద, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, నమిండ్ల శ్రీనివాస్, పసునూరి మనోహర్, నర్మెట వెంకటరమణ, డబోయిన ప్రభాకర్, రాములు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి
వరంగల్ : గత సాధారణ ఎన్నికల నుంచి మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న టీఆర్‌ఎస్‌కు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో మొట్టికాయ వేయూలని సర్వే సత్యనారాయణ అన్నారు. డీసీసీ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ జిల్లా అయిన ఓరుగల్లు నుంచే టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పే ప్రక్రియ ప్రారంభించాలని కోరారు.
ఆరు నెలల్లో లోక్‌సభకు ఉప ఎన్నిక
Published Sat, Mar 5 2016 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM
Advertisement
Advertisement