Survey Satyanarayana
-
కాంగ్రెస్‌లో కొట్లాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ఆదివారం గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో కొట్లాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఇతర నేతలతో వాగ్వాదానికి దిగడంతోపాటు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఓ నేతపై దాడికి దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనను అడ్డుకోబోయిన పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌పై దాడికి పాల్పడ్డారు. ఆయనపై వాటర్ బాటిల్ విసిరారు. దీంతో ఆగ్రహించిన కిషన్... సర్వేతో బాహాబాహీకి సిద్ధమవగా ఇతర నేతలు వారిని నిలువరించి సర్వేను సమావేశం నుంచి బయటకు పంపారు. అనంతరం ఆయనపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. ఉత్తమ్ అధ్యక్షతన ఆదివారం గాంధీ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల సమావేశం జరిగింది. ఈ భేటీకి కుంతియాతోపాటు ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, సర్వే సత్యనారాయణ, పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు. టీపీసీసీ వర్గాల ప్రకారం... ఈ సమావేశంలో సర్వే హల్చల్ చేశారు. పార్టీ ఓటమిపై సమీక్షించే హక్కు కుంతియా, ఉత్తమ్‌లకు లేదని మండిపడ్డారు. కుంతియా టికెట్లు అమ్ముకున్నారని, పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం విషయంలోనూ నష్టం చేశారని ఆరోపించారు. ఆయన కారణంగానే పార్టీ ఓడిపోతే మళ్లీ ఆయనే సమీక్షలు నిర్వహించడమేంటని నిలదీశా>రు. అలాగే ఉత్తమ్ వైఖరి కూడా ఓటమికి కారణమైందన్నారు. ఈ సందర్భంగా కుంతియానుద్దేశించి పరుష పదజాలంతో దూషణలకు దిగారు. దీంతో ఆయన్ను అడ్డుకునేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ ప్రయత్నించగా తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్‌తో కిషన్‌పై సర్వే దాడి చేశారు. ఈ సమయంలో మరో ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించినా సర్వే శాంతించలేదు. ఈ పరిస్థితుల్లో కిషన్, సర్వేలు పరస్పరం దాడి చేసుకునే వరకు పరిస్థితి రావడంతో నేతలు వారించి సర్వేను సమావేశం నుంచి బయటకు పంపారు. ఘర్షణకు దిగినందుకే క్రమశిక్షణ చర్యలు... ఈ పరిణామం అనంతరం సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. కుంతియా, ఉత్తమ్‌లపై సర్వే అనుచిత వ్యాఖ్యలు చేశారని, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌పై దాడికి పాల్పడ్డారని, సమావేశంలో సంబంధం లేని అంశాలు మాట్లాడుతూ నేతలను నిందించి ఘర్షణకు దిగినందుకు ఆయన్ను క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేసినట్లు తెలిపాయి. అధిష్టానం ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. వారిద్దరూ టీఆర్ఎస్ కోవర్టులు: సర్వే కాంగ్రెస్ నుంచి తనను సస్పెండ్ చేయడంపై సర్వే సత్యనారాయణ మండిపడ్డారు. తనను సస్పెండ్ చేసే అధికారం టీపీసీసీలో ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఏఐసీసీ సభ్యుడైన తాను కేంద్ర మంత్రిగా పనిచేశానని, సోనియాకు మాత్రమే తాను విధేయుడినని చెప్పారు. మాజీ మంత్రి డి.కె.అరుణ ఇచ్చిన విందుకు హాజరైన సర్వే అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్, కుంతియాల వల్లే పార్టీ ఓడిపోయిందని, పార్టీ ఓటమిపై మళ్లీ వారే సమీక్ష చేయడాన్ని ప్రశ్నించానన్నారు. దీంతో వారే తనపై రౌడీ మూకలను ఎగదోశారని, వారికి గట్టిగానే సమాధానం చెప్పానన్నారు. అసలు సమీక్షలు చేయాలని అధిష్టానం వారికి చెప్పలేదన్నారు. పోటీ చేయని వాళ్లు సమీక్షలో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ఉత్తమ్, కుంతియాలు టికెట్లు అమ్ముకున్నారని, టీఆర్ఎస్కు కోవర్టులుగా పనిచేశారని, పూర్తి ఆధారాలతో ఒకట్రెండు రోజుల్లో అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రేపటి నుంచి వారి భరతం పడతానని, పదవులు ఊడపీకిస్తానని సర్వే హెచ్చరించారు. -
మామపై రెబెల్‌గా పోటీ చేస్తా..!
సాక్షి, హైదరాబాద్: ‘నా పేరు సర్వే సత్యనారాయణ అల్లుడు కాదు.. క్రిశాంక్ మాత్రమే. ఉస్మానియా విద్యార్థి నేతగా కంటోన్మెంట్ ప్రజలకు సుపరిచితుడిని. 6 నెలలుగా నియోజకవర్గంలో బస్తీ నిద్రలు చేసి ప్రజలకు చేరువయ్యాను. మా జేబులన్నీ ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఎవరో వచ్చి టికెట్ ఎగరేసుకుపోతే ఎలా.. ఈ రోజు మా మామ.. రేపు ఇంకో పారాచూట్ నేత.. ఇంక మాకు ఓపిక లేదు. నేను రెబ ల్గా పోటీచేసేందుకే సిద్ధమవుతున్నా’ అని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అల్లుడు మన్నె క్రిశాంక్ అన్నారు. ఓయూ విద్యార్థి నేత అయిన క్రిశాంక్‌కు గత ఎన్నికల్లో త్రుటిలో కంటోన్మెంట్ టికెట్ చేజా రింది. గత ఎన్నికల సందర్భంగా తన పేరును అభ్యర్థిగా ప్రకటించి చివరి నిమిషంలో మార్పు చేశారు. అయినా ఆయన అప్పటి నుంచి పార్టీలో కొనసాగు తూ, కంటోన్మెంట్ నియోజకవర్గంలో క్రియాశీలకం గా పనిచేస్తున్నారు. తన మామ సర్వేకు కాంగ్రెస్ టికెట్ కేటాయించడంపై క్రిశాంక్ గళం విప్పారు. మంగళవారం ఆయన గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. 3 సార్లు ఓడిపోయిన సర్వేకు టికెట్ ఎలా ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే ఎవరో ప్రజలకు తెలియదు.. సర్వే సత్యనారాయణ ఎవరో కంటోన్మెంట్ ప్రజలకు తెలియదని, తన పేరు అందరికీ తెలుసని క్రిశాంక్ చెప్పారు. ఈసారి కాంగ్రెస్ ఒక్క ఓయూ విద్యార్థి నాయకుడికి కూడా టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ టికెట్ రావాలంటే గాడ్‌ఫాదర్ ఉండాలని వ్యాఖ్యానించారు. -
కాబోయే సీఎంను.. మీ సంగతి చూస్తా
మూసాపేట: వచ్చేది మా ప్రభుత్వమే.. కాబోయే సీఎంను.. అందరి లెక్కలు తీస్తున్నా.. మీ సంగతి చూస్తా అంటూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి వైపు వేలు చూపిస్తూ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఆహ్వానం పంపలేదని కలెక్టర్‌పై చిందులు తొక్కారు. దీంతో కలత చెందిన కలెక్టర్ సభలో మొహం చిన్నబుచ్చుకున్నారు. కూకట్పల్లి వైజంక్షన్‌లో శనివారం నిర్వహించిన అంబేడ్కర్ జయంత్యుత్సవాల సభ ఈ వివాదానికి వేదికైంది. సభ కొనసాగుంతుండగా వేదిక వద్దకు సర్వే వచ్చారు. ఆ సమయంలో కలెక్టర్ ప్రసంగిస్తుండగా దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు నపారి చంద్రశేఖర్ స్టేజీపైకి పిలవడంతో సర్వే వెళ్లి ఆసీనులయ్యారు. కలెక్టర్ ప్రసంగం ముగియడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో మెట్రో ఎండీ మాట్లాడుతుండగా మధ్యలో సర్వే సత్యనారాయణ కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. కలెక్టర్ స్పందిస్తూ ఇది అధికారిక కార్యక్రమం అని, ప్రొటోకాల్ ప్రకారం పిలిచినట్లు చెప్పారు. అధికారిక కార్యక్రమం అయితే ప్రభుత్వ పథకాలు ఎందుకు చెబుతున్నావంటూ సర్వే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంవీ రెడ్డి ప్రతిస్పందిస్తుండగానే.. ‘నో మోర్ ఆరగ్యమెంట్.. మా ప్రభుత్వం వస్తే నేనే సీఎం’ అంటూ వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో సర్వేను మాట్లాడాల్సిందగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయనకు మైక్‌ను అందించారు. సర్వే సత్యనారాయణ మైక్‌ను అందుకుంటూనే.. ‘అందరి లెక్కలు తీస్తున్నా.. మీ సంగతి చూస్తా’ అంటూ ప్రసంగం ప్రారంభించారు. బీజేపీ దళితుల పట్ల వివక్ష చూపిస్తోందని, ఇలాగే చేస్తే దళికిస్తాన్ అని ప్రత్యేక దేశం కోరుతాం.. ఖబడ్దార్ మోదీ అని హెచ్చరిస్తుండగా.. దళిత ఐక్యవేదిక అధికార ప్రతినిధి కట్టా నర్సింగరావు కల్పించుకుని ఇది పార్టీ సమావేశం కాదని, అంబేడ్కర్ గురించి చెప్పాలని చేతులు జోడించి వేడుకున్నారు. దీంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కల్పించుకుని రాజకీయాలు మాట్లాడవద్దని కలెక్టర్‌కు సూచించిన మీరే రాజకీయాలు మాట్లాడితే ఎలా అంటూ సర్వేను ప్రశ్నించారు. సభను తప్పుదోవపట్టించేలా వ్యవహరించడంపై సర్వేను ఎమ్మెల్యే నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు సైతం వేదికపైకి చేరడంతో సభ రసాభాసగా మారింది. తోపులాటలో కలెక్టర్‌కు రక్షణగా నిల్చొన్న ఆర్ఐ అశ్విన్‌కుమార్ ముక్కుకు గాయాలయ్యాయి. మైక్‌లు విరిగిపోయాయి. దీంతో డీసీపీ వెం కటేశ్వర్‌రావు, ఏసీపీ భుజంగరావు వేదికపైకి చేరుకున్న దళిత నాయకులను, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులను అదుపు చేసి వివాదం సద్దుమణిగేలా చూశారు. తనను అకారణంగా దూషించడంతో కలత చెందిన కలెక్టర్ రెండు చేతులు జోడించి సర్వేకు మొక్కి కంటతడి పెట్టుకుంటూ సభలోంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సర్వే సత్యనారాయణ నిష్క్రమించారు. అందరూ వెళ్లిపోవడంతో సభ అర్ధంతరంగా ముగిసింది. సర్వేపై కేసు నమోదు.. కేపీహెచ్‌బీ కాలనీ: ఈ ఘటనపై తహసీల్దార్ నాగరాజు ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ వడ్డే ప్రసన్నకుమార్ తెలిపారు. కూకట్‌పల్లిలో జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ ఎంవీ రెడ్డితో సర్వే సత్యనారాయణ వాగ్వాదానికి దిగారని, కలెక్టర్‌కు రక్షణగా వచ్చిన తహసీల్దార్ నాగరాజు, ఆర్ఐ అశ్విన్కుమార్లపై దాడికి పాల్పడ్డారని తహసీల్దార్ ఫిర్యాదు మేరకు సర్వే సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘సర్వే’పై చర్యలు తీసుకోండి: రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్ కేపీహెచ్‌బీకాలనీ: మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని మేడ్చల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. శనివారం సర్వే సత్యనారాయణ చర్యలను నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. కూకట్‌పల్లిలో జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ ఎంవీ రెడ్డిపై దుర్భాషలాడటం, బెదిరించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఆర్ఐపై అకారణంగా చేయి చేసుకోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్వే సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏసీపీ భుజంగరావు, సీఐ ప్రసన్నకుమార్‌లకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు గౌతంకుమార్, ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ నాగరాజు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు నిజాయితీ లేదు: సర్వే
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి నీతి, నిజాయతీ లేదని మరోసారి తేలిపోయిందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ వస్తే చప్రాసిగా పనిచేస్తా, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా లాంటి ఎన్నో మాయమాటలు చెప్పి.. మాట తప్పారని పేర్కొన్నారు. క్యాబినెట్ లో ఒక్క మహిళకి కూడా స్థానం కల్పించని కేసీఆర్‌కి మహిళల విలువ ఏం తెలుసునని ప్రశ్నించారు. అమరవీరులు, దళితులు, మహిళల పట్ల గౌరవం ఉంటే మీరాకుమార్‌కి ఓటు వేయాలన్నారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులని కలిసి మీరాకుమార్‌కి ఓటు వేయాలని కోరతామన్నారు. మీరా కుమార్‌కు టీఅర్ఎస్ నాయకులు ఓటు వేయకపోతే ప్రజలు ఎదురు తిరుగాలని కోరారు. -
బీజేపీకి మద్దతుకు తొందరెందుకు?: సర్వే
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు తొందర పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారా యణ ప్రశ్నించారు. శనివారం గాంధీభ వన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని, మీరా కుమార్ స్పీకరుగా ఉన్నందుకే తెలంగాణ బిల్లు పాస యిందని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ‘సీఎం కేసీఆర్‌కు దండం పెట్టి అడుగుతున్నా.. మీరాకుమార్‌కు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేయండి’ అని విజ్ఞప్తి చేశారు. దళిత సీఎం మాటను నిలబెట్టుకోనప్పుడే కేసీఆర్‌పై దళిత వ్యతిరేకి ముద్ర పడిందన్నారు. మీరాకుమార్‌కు మద్దతు ఇవ్వకపోతే ప్రజలే తగిన శాస్తి చేస్తారన్నారు. బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కన్నా మీరాకుమార్ గొప్ప అభ్యర్థి అ న్నారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు మీరాకుమార్‌కు ఓటేయలేమని మనస్సాక్షిగా చెప్పగలరా అని ప్రశ్నించారు. -
కేసీఆర్ నీకు దండం పెడతా: సర్వే
హైదరాబాద్: సోనియా గాంధీకి దళితులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలంటే ప్రేమ అని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. మీరా కుమారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఆనందకరం.. ఆమెకు అన్ని అర్హతలు, సమర్ధత, అనుభవాలు ఉన్నాయన్నారు. ఎన్డీఏ అభ్యర్థి కోవింద్ కన్నా మీరాకుమార్ గొప్ప అభ్యర్ధని తెలిపారు. ఇందిరా హయాంలో వీవీ గిరి గెలిచినట్టుగా.. మీరా కుమార్ గెలిచే అవకాశం ఉందని.. యూపీఏ కూటమిలో ఉన్న నితీష్ సొంత నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ అంశంపై నితీష్ పునరాలోచించుకోవాలన్నారు. కేసీఆర్ మోదీ మాయలో పడ్డారని.. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ.. మీరా కుమార్ స్పీకర్‌గా ఉన్నప్పుడే తెలంగాణ బిల్‌పాస్ అయింది. కేసీఆర్‌కు దండం పెట్టి అడుగుతున్నా యూపీఏ అభ్యర్థికే మద్దతివ్వాలన్నారు. కేసీఆర్ కాబినెట్ లో దళితుడు లేడు, మహిళ లేదు. రాష్ట్రం వస్తే దళితుడిని సీఎం చేస్తా అని చెప్పిన కేసీఆర్‌పై ఇప్పటికే దళిత వ్యతిరేకని అనే ముద్ర పడిందన్నారు. యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఆర్ఎస్ఎస్ నామినేట్ చేసిన వారికి అసదుద్దీన్ ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. -
హరీశ్‌ను ఏకాకిని చేశారు: సర్వే
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో మంత్రి హరీశ్‌రావును కేసీఆర్ కుటుంబం ఏకాకిని చేసిందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు.తెలంగాణ ఉద్యమం నడిపిందంతా హరీశేనని, అలాగే ఉద్యమ సమయంలో చప్రాసీ పని నుండి పార్టీని నడపడం వరకు అంతా హరీశ్‌రావే చూసుకున్నారని అన్నారు. ఆ తర్వాత అమెరికా నుంచి కేసీఆర్ కొడుకు, కూతురు ఊడిపడ్డారన్నారు. హరీశ్‌కు కష్టపడే తత్వం ఉందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లంతా హరీశ్‌నే కోరుకుంటున్నారన్నారు. హరీశ్‌కు ఇంకా రెండేళ్లే టైం ఉందని, తన మామకు వెన్నుపోటే పొడుస్తాడో.. ఇంకా ఏమి చేస్తాడో.. ఇప్పుడే చేయాలని సూచించారు. ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలనే కోరిక తీర్చుకోవాలని సలహానిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది అధికారంలోకి వస్తుందని అన్నారు. -
నియంతృత్వానికి కాలం చెల్లింది
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రధాని నరేంద్రమోదీ నియంతృత్వ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక అత్యయిక పరిస్థితిని తీసుకురావడం ద్వారా పేదలను రోడ్ల మీద నిలబెట్టారని దుయ్యబట్టారు. బ్యాంకుల్లో భద్రపరుచుకున్న డబ్బును ఇవ్వకుండా ఆంక్షలు విధించి ప్రజలను మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, పార్టీ నేతలు బండారి లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెనక్కి తెస్తానని ప్రచారం చేసిన ప్రధాన మంత్రి.. నయాపైసా వెనక్కి తీసుకురాకపోగా.. నోట్ల మార్పిడిలో సొంతపార్టీ నేతలకు డబ్బు సంచులను పంపారని అన్నారు. ఆర్బీఐ నుంచి నేరుగా బీజేపీ, భాగస్వామ్య పక్షాలకు పెద్ద ఎత్తున నగదు తరలిపోయిందని ఆరోపించారు. బ్లాక్ మనీని మార్చుకున్న దోషులను పట్టుకోకుండా పేదలను కష్టాలకు గురిచేయడం దారుణమన్నారు. నవంబర్ 8వ తేదీ తర్వాత జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంత నల్లధనం వెనక్కి తేగలిగారు? ఆర్థికంగా దేశం ఎంత నష్టపోయింది? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఎంతమంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు? అనే ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలని నిలదీ శారు. నోట్ల రద్దును మొదట్లో వ్యతిరేకిం చిన కేసీఆర్.. 24 గంటల్లోనే మనసు మా ర్చుకోవడం వెనుక మతలబు దాగుం దన్నారు. దోచుకున్న డబ్బుకు గ్యారెంటీ లభించగానే మోదీని మెచ్చుకుంటూ ప్రకటనలు చేశారని సర్వే వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై ప్రధానిని అభినందిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం సిగ్గుచేట న్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. సహకార బ్యాంకుల నుం చి రుణాలు తీసుకునే రైతులకు రెండు నెలల పాటు వడ్డీ మాఫీ చేస్తానని ప్రధాని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నా రు. ఏడాది వరకు రూ.లక్ష లోపు రుణాలకు వడ్డీలేదని... కొత్తగా మాఫీ పేరిట మోసపూరిత ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 7న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు. -
గవర్నర్.. చెంచాగిరీ మానుకో!
పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరు కేంద్ర మాజీ మంత్రి సర్వే రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గవర్నర్‌గా కొనసాగే హక్కు నరసింహన్‌కు లేదని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంచాగిరీ చేస్తున్న గవర్నర్‌ను తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సర్వే మాట్లాడారు. అప్రజాస్వామిక ప్రభుత్వానికి అండగా నిలుస్తూ పదవిని కాపాడుకునేందుకు.. అధికారపార్టీకి ప్రచారకర్తగా మారారని దుయ్యబట్టారు. రాజ్యాంగ ప్రతినిధిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన గవర్నర్.. కేసీఆర్ అనైతిక చర్యలకు వకల్తా పుచ్చుకోవడం దురదృష్టకరమన్నారు. గవర్నర్ తన పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడం మంచిదని హితవు పలికారు. -
జిల్లాల విభజనతోనే సీఎం పతనం ప్రారంభం
సర్వే సత్యనారాయణ వరంగల్/జనగామ: జిల్లాల విభజనతోనే కేసీఆర్ పతనం మొదలైందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయద్దని, జనగామ జిల్లా కావాలని జిల్లా పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు మంగళవారం జరిగిన జిల్లా బంద్ లో ఆయన పాల్గొన్నారు. భువనగిరి ప్రాంతంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములున్నందునే యాదాద్రి జిల్లా తెరపైకి వచ్చిందన్నారు. మైహోమ్స్ రామేశ్వర్రావు ఒక జిల్లా, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఈటెల కోసం మరో జిల్లా ఇస్తున్నాడన్నారు. హన్మకొండ జిల్లా నిర్ణయం మార్చుకోకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానన్నారు. -
జిల్లాల విభజనతో కేసీఆర్ పతనం ప్రారంభం
-ప్రజల క్షణికావేశంతోనే టీఆర్ఎస్కు అధికారం -హన్మకొండ విడదీస్తే ఆమరణ దీక్ష -కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ జనగామ(వరంగల్ జిల్లా) జిల్లాల విభజనతోనే సీఎం కె.చంద్రశేఖర్‌రావు పతనం మొదలైందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయద్దని, జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు మంగళవారం జరిగిన జిల్లా బంద్‌లో ఆయన పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వరంగల్‌లో, జనగామలో సర్వే సత్యనారాయణ మాట్లాడారు. భువనగిరి ప్రాంతంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినందునే యాదాద్రి జిల్లా తెరపైకి వచ్చిందన్నారు. మైహోమ్స్ రామేశ్వర్రావు ఒక జిల్లా, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఈటెల కోసం మరో జిల్లా ఇస్తున్నాడని అన్నారు. జనగామను జిల్లాగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, జిల్లా ప్రజలంతా ఇవ్వాలని కోరుతున్నా సీఎం మొండివైఖరి అవలంభించడం సబబు కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 11వ జిల్లా జనగామ చేస్తానని మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఘోరంగా మోసం చేశాడన్నారు. వరంగల్‌ను విడదీస్తే చరిత్రకు చేటు తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ మిగిలి పోతారని అన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు నిర్ణయం మార్చుకోకుంటే తాను జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చింది తల్లి సోనియా అయినప్పటికీ ప్రజల క్షణికావేశంతో తీర్పు ఇవ్వడంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యాడని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి, నేరవేరలేని వాగ్దానాలు ఇవ్వడంతో ప్రజలు నమ్మి ఆయన పార్టీని గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇస్తుందన్నారు. కాలేజీల తనిఖీల పేరుతో ఫీజు రీరుుంబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులకు ఉన్నత విద్య అందడం లేదన్నారు. మరో రెండు నెలల్లో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ స్థానంలో నేనే వస్తున్నా.. ఏంటో చెప్పను.. చమత్కారం చూస్తారు అని సర్వే అన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయినీ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ హన్మకొండ జిల్లా వద్దని, జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్షాలు ఇచ్చిన బంద్‌ను జిల్లా ప్రజలు విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. ప్రజల అకాంక్ష మేరకు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకులు నమిండ్ల శ్రీనివాస్, ఈవీ.శ్రీనివాసరావు, బట్టి శ్రీను, కొత్తపల్లి శ్రీనివాస్, రజనీకాంత్, మైనంపాటి శ్రీను, ధన్‌రాజ్ పాల్గొన్నారు. -
తెలంగాణ ఇప్పించింది నేనే: సర్వే
సుందరయ్య విజ్ఞానకేంద్రం: సోనియాను ఒప్పించి తెలంగాణ ఇప్పించింది తానేనని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. అనేక మంది తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారు, ఇంకా ఆలస్యం చేస్తే తెలంగాణ కాలిపోతోందని, సోనియా జన్మదినం రోజు ఆమె ఒప్పించి ప్రకటన చేయించానని అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ దళిత సాహిత్య అకాడమి(బీడీఎస్‌ఏ) ఆధ్వర్యంలో ‘ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన విధానం – బీసీ,ఎస్సీ, ఎస్టీ సంఘాల పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్వే మాట్లాడుతూ తెలంగాణ రావటానికి దళితులే ప్రధాన కారణమన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మోసం చేశాడని ఎద్దేవా చేశారు. ఎంసెట్ లీకేజీలో కన్వీనర్, డిప్యూటీ సీఎంను ఎందుకు పదవుల నుంచి తొలగించటం లేదని ప్రశ్నించారు. వారి వెనుక కేటీఆర్ ఉన్నందుకే చర్యలు తీసుకోవటం లేదని అన్నారు. బీడీఎస్‌ఏ తెలంగాణ అధ్యక్షులు నల్లా రా«ధాకృష్ణ, ఛీప్ కో–ఆర్డినేటర్ ఇనుగాల భామ్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరు నెలల్లో లోక్‌సభకు ఉప ఎన్నిక
కోర్టు తీర్పుతో మళ్లీ మీ మధ్యకు వస్తా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హసన్‌పర్తి : ఆరునెలల్లో వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నికలు వస్తాయని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 54వ డివిజన్ దేవన్నపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో అవకతవకలు జరిగాయని కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు. త్వరలోనే తనుకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని ఆరోపించారు. ఉప ఎన్నిక వస్తే మళ్లీ తానే కాంగ్రెస్ అభ్యర్థినని చెప్పారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఝలక్ ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ నోటి నుంచి వస్తున్న ప్రతి మాటా అబద్ధమేనన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క పథకాన్నీ ప్రవేశపెట్టలేదన్నారు. 87 వేల మంది గౌడకులస్థులు ఉన్నా ఆ వర్గానికి గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. మడికొండ : కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సర్వే సత్యనారాయణ అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో భాగంగా 34వ డివిజన్ అభ్యర్ధి మేకల ఉపేందర్‌కు మద్దతుగా శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ కృషి తోనే తెలంగాణ రాలేదని, ఎందరో ఉద్యమకారుల పోరాటం, సోనియాగాంధీ చొరవ వల్లే వచ్చిందని అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మాజీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నెరెళ్ల శారద, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, నమిండ్ల శ్రీనివాస్, పసునూరి మనోహర్, నర్మెట వెంకటరమణ, డబోయిన ప్రభాకర్, రాములు పాల్గొన్నారు. టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి వరంగల్ : గత సాధారణ ఎన్నికల నుంచి మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న టీఆర్ఎస్కు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో మొట్టికాయ వేయూలని సర్వే సత్యనారాయణ అన్నారు. డీసీసీ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ జిల్లా అయిన ఓరుగల్లు నుంచే టీఆర్ఎస్కు బుద్ధి చెప్పే ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. -
ఆయన అక్కడ గెలవాలి...
వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ఒక మాజీ ఎమ్మెల్యేను ఆశల పల్లకీలో ఊరేగిస్తున్నది. ఉప ఎన్నిక ఏమిటీ మాజీ ఎమ్మెల్యేలో ఆశలు రేకెత్తించడమేమిటని అనుకుంటున్నారా ? అనుకోని పరిస్థితుల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి కావడం తన రాజకీయ భవిష్యత్‌కు కలిసొస్తుందని ఈ మాజీ గట్టిగా విశ్వసిస్తున్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ సీటుకు సర్వే పోటీచేసి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ ఉప ఎన్నికల్లో సర్వే గెలిస్తే, తనకు మల్కాజ్గిరి టిక్కెట్టుకు ఆయన అడ్డు ఉండదని లెక్కలు వేసుకుంటున్నాడట. అంతేకాకుండా ఈ ఎంపీ సీటుకు అధిష్ఠానం వద్ద సర్వేనే తనను రికమెండ్ చేస్తారని నమ్ముతున్నారట. ఈ నమ్మకంతో ఉప ఎన్నికల ప్రచారంలో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారట. అంతే కాకుండా ప్రచారానికయ్యే ఖర్చును, ఎన్నికల వ్యయాన్ని కూడా తనవంతుగా భరిస్తున్నాడట. ఈ మాజీ ఎమ్మెల్యే తీరును చూసి ఇది అయ్యేది కాదు పొయ్యేది కాదని... ఈ పేరుతో సదరు నేత చేతి చమురు మాత్రం బాగానే వదులుతోందని సహచరనాయకులు గుసగుసలు పోవడం కొసమెరుపు. -
కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే
♦ రాజయ్య నివాసంలో ఘటనతో మార్పు ♦ పార్టీకి నష్టం కలుగుతుందనే భావనతో టీపీసీసీ చర్యలు ♦ ఖాళీ బి-ఫారంతో వరంగల్‌కు ఉత్తమ్ ♦ ముందుగా ముగ్గురు అభ్యర్థులతో నామినేషన్ ♦ అధిష్టానంతో సంప్రదింపుల అనంతరం సర్వేకు అవకాశం సాక్షి, వరంగల్, హైదరాబాద్: అనూహ్య పరిణామాల నేపథ్యంలో వరంగల్ లోక్‌సభ స్థానంలో తమ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ మార్చింది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను రంగంలోకి దించింది. తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్న సిరిసిల్ల రాజయ్య నివాసంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు పిల్లలు సజీవ దహనమైన నేపథ్యంలో ఈ పరిణామాలు జరిగాయి. ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో కూడా ఉండే పరిస్థితి లేదని, రాజయ్యకు అనుకూలంగా ఓట్లు అడిగే నైతికత కూడా ఉండదని టీపీసీసీ నేతలు తీవ్ర ఆందోళన చెందారు. సిరిసిల్ల రాజయ్యను అభ్యర్థిగా కొనసాగిస్తే పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో అభ్యర్థిని మార్చారు. ఉత్తమ్ బిజీ బిజీ... సిరిసిల్ల రాజయ్యను మార్చాలన్న నిర్ణయానికి అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ అందిన వెంటనే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరంగల్‌కు బయలుదేరి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లకు గడువు ఉండడంతో అవకాశం ఉన్న పార్టీ నేతలతో నామినేషన్ వేయించాలని జిల్లా నేతలకు సూచించారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి జి.విజయ రామారావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సమయంలో ఉత్తమ్ వరంగల్‌కు ప్రయాణిస్తూనే.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతోనూ, జిల్లా నేతలు, పార్టీ అభ్యర్థులతో ఫోన్ల ద్వారా సమన్వయం చేశారు. నామినేషన్ కేంద్రానికి 5 నిమిషాలు ముందుగా చేరుకుని సర్వే సత్యనారాయణకు బీ-ఫారాన్ని అందించారు. అంతకుముందు సిరిసిల్ల రాజయ్యకు జారీచేసిన బీ-ఫారాన్ని ఉపసంహరించుకున్నారు. సర్వే సత్యనారాయణ 1985లో హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో సిద్ధిపేట ఎంపీగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఆ నియోజకవర్గం రద్దయింది. దాంతో 2009లో రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంలో పోటీ చేసి గెలిచి.. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా అనూహ్య పరిణామాల మధ్య వరంగల్ ఉప ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్‌కి నష్టం కలిగించదు: జానారెడ్డి రాజయ్య నివాసంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, దానివల్ల పార్టీకి నష్టమేమీ ఉండదని సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి అన్నారు. ఆ దుర్ఘటనతో పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారన్నారు. ప్రమాదానికి కారణాలు, వాస్తవాలన్నీ పోలీసులు, కోర్టు విచారణలో తేలుతుందని... ఆ అంశాలపై తాము మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ఈ ఘటన కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావాన్ని చూపదని, అభ్యర్థులపై అభియోగాలు ఉండటం సహజమేనని వ్యాఖ్యానించారు. కోలుకున్నాం.. కొట్లాడుతాం: ఉత్తమ్ రాజయ్య నివాసంలో జరిగిన ఘటనతో కాంగ్రెస్‌కు నష్టమేనని, అభ్యర్థి మార్పు ద్వారా ఆ నష్టాన్ని అధిగమించామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాజయ్య నివాసంలో జరిగిన దుర్ఘటన బాధాకరమన్నారు. అయితే అది రాజయ్య వ్యక్తిగత అంశమని.. దాని ప్రభావం పార్టీ శ్రేణులపై, ప్రజలపై ఉండదని చెప్పారు. టీఆర్ఎస్ను ఈ ఎన్నికల్లో ఓడించి, ఘన విజయం సాధిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. -
వరంగల్ టిక్కెట్ దక్కించుకున్న సర్వే
-
ఓడిపోయిన రాజకీయ ప్రముఖుల కుమార్తెలు!
హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలో బీజేపీ, టీడీపీలకు చావుదెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. రాజకీయ ప్రముఖుల కుమార్తెలు ఓడిపోయారు. కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే జీ.సాయన్న,కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి శంకర్రావు కుమార్తెలు ముగ్గురూ ఓడిపోయారు. 4వ వార్డు పికెట్‌లో పోటీ చేసిన ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితపై 844 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ విజయం సాధించారు. 2వ వార్డు రసూల్ పురలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థి సదాకేశవ రెడ్డి 1534 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం 8 వార్డులకు 114 మంది పోటీ చేశారు. నాలుగు టీఆర్ఎస్, రెండు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని ప్రకటించారు. మిగిలిన రెండిటిలో ఒకటి కాంగ్రెస్, మరొకటి కాంగ్రెస్ రెబల్స్ గెలుచుకున్నారు. 1వ వార్డులో స్వతంత్రంగా పోటీ చేసిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి జక్కుల మహేశ్వరరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి జంపన ప్రతాప్‌పై 616 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 3 వార్డు కార్ఖానాలో టీఆర్ఎస్ అభ్యర్ధి జంపన విద్యావతిపై 2500 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ విజయం సాధించారు. వార్డుల వారీగా గెలిచిన అభ్యర్థులు 1వ వార్డు మహేశ్వర రెడ్డి (టీఆర్ఎస్ రెబల్) 2వ వార్డు కేశవరెడ్డి (టీఆర్ఎస్) 3వ వార్డు అనితా ప్రభాకర్ (టీఆర్ఎస్ రెబల్ ) 4వ వార్డు నళినీ కిరణ్ (టీఆర్ఎస్) 5వ వార్డు మారేడ్‌పల్లి రామకృష్ణ (ఇండిపెండెంట్) 6వ వార్డు పాండు యాదవ్ (టీఆర్ఎస్) 7వ వార్డు తిరుమలగిరి భాగ్యశ్రీ(కాంగ్రెస్) 8వ వార్డు బొల్లారం లోకనాథం (టీఆర్ఎస్) -
'దళితులు సీఎం పదవికోసం ఆరాట పడలేదు'
కరీంనగర్: ముఖ్యమంత్రి పదవికోసం దళితులు ఏనాడు ఆరాటపడలేదని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం దళితుడునే సీఎం చేస్తామని కేంద్రమంత్రి జైరాం రమేష్ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గతంలో దళితులు సీఎం పదవిని చేపట్టడంతో, రానున్న రోజుల్లో ఆ పదవిని బీసీ వర్గానికి కట్టబెట్టాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేయడంతో సర్వే స్పందించారు. దళితుడ్ని సీఎం చేయడం కాంగ్రెస్ ఎజెండా కాదని, అయితే అవకాశం వస్తే దళితుడు సీఎం అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. తమకు సీఎం పదవి కేటాయించాలని దళితులు ఎప్పుడూ అడగలేదని, ఆ విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఎప్పుడూ తమ దృష్టికి తీసుకురాలేదన్నారు. పదవుల కోసం ఆరాటపడే స్లోగన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దేనని సర్వే తెలిపారు. ఎప్పటికైనా టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయాల్సిందేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమతో పొత్తుపెట్టుకుంటే వారికే శ్రేయస్కరమన్నారు. -
సిట్టింగ్‌లకు ఫిటింగ్
కాంగ్రెస్ పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య కలహం ముదిరి పాకాన పడుతోంది. ఎమ్మెల్యేలను మార్చాలంటూ ఎంపీ.. ఎంపీని మార్చాలంటూ ఎమ్మెల్యేలు ఎత్తుకు పై ఎత్తులు వేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభల పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్‌లు అధిష్టానం వద్ద పావులు కదుపుతుండగా.. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. అక్కడి ఎంపీ జైపాల్‌రెడ్డి చేవెళ్ల లోక్‌సభా స్థానం నుంచి తిరిగి పోటీ చేసే అంశం సందిగ్ధంగా ఉండటంతో.. ఆయా శాసనసభా నియోజకవర్గాల పరిధిలో అయోమయ పరిస్థితి నెలకొంది. మల్కాజిగిరిలో పోటాపోటీ జాబితా మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని శాసనసభా స్థానాలకు ఎంపీ సర్వే సత్యనారాయణ తనదైన జాబితాను సిద్ధం చేశారు. అన్ని స్థానాల్లో సిటింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకుల పేర్లను ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఎల్బీనగర్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్దగోని రాంమోహన్‌గౌడ్, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డికి ప్రత్యర్థి వర్గంగా ముద్రపడ్డ రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరిలో ఎమ్మెల్యే రాజేందర్‌ను వ్యతిరేకించే జీహెచ్ఎంసీ కో ఆప్షన్ సభ్యులు శ్రీధర్, కంటోన్మెంట్లో ఎమ్మెల్యే శంకర్రావు అంటే పడని బోర్డు వైస్ చైర్మన్ జయప్రకాష్, కుత్బుల్లాపూర్‌లో ప్రతాప్, కొలను హన్మంతరెడ్డిలలో ఒకరి పేర్లను సర్వే ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రతిపాదిస్తున్నారు. దీంతో తమ నియోకజవర్గాల్లో గ్రూపులకు కారణమైన ఎంపీ సర్వేను ఈ సారి తప్పక మార్చాల్సిందేనంటూ ఎమ్మెల్యేలు ఇటీవల ఏఐసీసీ ప్రముఖులను కలిసి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. సర్వే స్థానంలో కొత్త అభ్యర్థి ఎవరికిచ్చినా పరవాలేదని పేర్కొంటున్నట్లు సమాచారం. పావులు కదుపుతున్న అంజన్ సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో తనదైన ముద్ర ఉండాలంటూ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ సిటింగ్‌లను ఎవరినీ కదిపే పరిస్థితి లేకపోవటంతో.. కనీసం పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేలు లేని అంబర్‌పేట, ముషీరాబాద్, నాంపల్లి స్థానాల్లో రెండు చోట్ల తాను సూచించే అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలంటూ అంజన్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో అంబర్‌పేట, ముషీరాబాద్‌లలో ఎక్కడ అవకాశం ఉన్నా తన కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్ పేరును ప్రతిపాదించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. చేవెళ్లలో మొదలైన టికెట్ల హైడ్రామా చేవెళ్ల లోక్‌సభ పరిధిలో నగరానికి చెందిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేసిన అభ్యర్థులే మళ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే ఈ స్థానం నుంచి జైపాల్‌రెడ్డి తిరిగి పోటీ చేసే అంశం ఇంకా తేలకపోవటంతో కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో పూర్తి అయోమయం నెలకొంది. పార్లమెంటు పరిశీలకులు వచ్చిన సందర్భాల్లో జైపాల్‌రెడ్డి తరపున ఆయన అనుచరులు తిరిగి జైపాల్‌రెడ్డికే అవకాశం కల్పించాలని అర్జీలు ఇచ్చారు. తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో జైపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి తప్పుకొంటే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్లమెంటు స్థానానికి, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి మహేశ్వరం లేదా రాజేంద్రనగర్ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ టికెట్‌పై పూర్తి ధీమాతో ఉన్నా, మరో నాయకుడు నాగేందర్ యాదవ్ టికెట్ కోసం నగరానికి చెందిన మంత్రిని నమ్ముకున్నారు. -
విలీనం పై కేసిఆర్ మాటమార్చారు:సర్వే సత్యనారాయణ
-
మెజారిటీతోనే బిల్లుకు ఆమోదం: జైపాల్ రెడ్డి
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభలో మూడిం ట రెండొంతుల మెజారిటీతో ఆమో దం లభించిందని కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకున్నారంటూ ప్రచారం చేయడం సరికాదని, ఓటింగ్ ద్వారానే బిల్లు ఆమోదం పొందిందని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం తర్వాత మంగళవారం జైపాల్‌రెడ్డి నివాసానికొచ్చిన టీ-మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు స్వీట్లు పంచుకుని, బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రు లు సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్‌తోపాటు రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల, సారయ్య, ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులతో కలిసి జైపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘యూపీఏ, బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించాక కూడా బిల్లుకు తగిన సంఖ్యా బలం లేదని ఎవరైనా చెప్పగలరా? తెలంగాణ రావడం సీపీఎంకు ఇష్టం లేదు. అందుకే ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి బిల్లుపై సవరణలు, ఓటింగ్ కోరాలనుకుంటే ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మాదిరిగా సభలోని తమ తమ స్థానాల్లో ఎందుకు కూర్చోలేదు? అలాగాక వెల్‌లోకి దూసుకువచ్చి సవరణలపై ఓటింగ్ కోరడమేంటి?’’ అని ప్రశ్నించారు. కాగా తెలంగాణ ఏర్పాటు చారిత్రక విజయమని, దీన్ని ఉద్యమ అమరులకు అంకితమిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఏపీభవన్‌లో టీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబరాలు చేసుకున్నారు. తర్వాత విలేకర్లతో మాట్లాడారు. మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, యాదవరెడ్డి, మల్లురవి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా తెలంగాణలోని నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ తెలంగాణ తల్లి అని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అభివర్ణించారు. -
సర్వే’పై ఫిర్యాదాస్త్రం
‘హస్తిన’ బాటపట్టిన ఎమ్మెల్యేలు దిగ్విజయ్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపు అసంతుష్టుల జాబితాలో ఐదుగురు ఎమ్మెల్యేలు సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి: కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణపై శివారు ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శాసనసభ్యులు ఏదొకటి తేల్చుకునేందుకు ఢిల్లీబాట పట్టారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి ‘సర్వే’కు మరోసారి టికెట్ ఇవ్వవద్దనే డిమాండ్‌తో పార్టీ పెద్దలను కలవాలని నిర్ణయించారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు సర్వే సత్యనారాయణపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు హస్తిన వెళ్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అపాయింట్మెంట్ను కోరుతూ లేఖ రాశారు. మాజీమంత్రి శంకర్రావు సహా ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బండారి రాజిరెడ్డి, ఆకుల రాజేందర్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఈ మేరకు డిగ్గీరాజాకు సంయుక్తంగా లేఖ రాశారు. అధికారికంగా దిగ్విజయ్ అపాయింట్మెంట్ ఖరారు కానప్పటికీ, ఆయనకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మెల్యేలు శంకర్రావు, రాజిరెడ్డి ఇప్పటికే అక్కడ మకాంవేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ఆకుల రాజేందర్ కూడా శుక్రవారం రాత్రి దేశ రాజధానికి పయనమయ్యారు. కాగా, రంగారెడ్డి జిల్లాలో పార్టీ వ్యవహారాలు, మల్కాజిగిరి పార్లమెంటరీ సీటు పరిధిలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పార్టీ పరిస్థితిని తమతో చర్చిస్తామని లేఖలో పేర్కొన్నప్పటికీ, కేంద్రమంత్రి సర్వేపై ఫిర్యాదు చేసే అంశమే ప్రధానంగా కనిపిస్తోంది. కొన్నాళ్లుగా సర్వేపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలు... ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కు ఈసారి లోక్‌సభ టికెట్ రాకుం డా ప్రయత్నించాలనే నిర్ణయానికి వచ్చారు. అవినీతి, గ్రూపు రాజకీయాలను కేంద్రమంత్రి ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యేలు కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. స్థానికంగా ఆయనపై ఉన్న వ్యతిరేకత కూడా తమ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందనే భయం వీరిలో నెలకొంది. -
‘సర్వే’పై శివారు ఎమ్మెల్యేల శివాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణపై శివారు ఎమ్మెల్యేలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయన వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శాసనసభ్యులు తాడోపేడో తేల్చుకునేందుకు ఢిల్లీ బాట పట్టారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి ‘సర్వే’కు మరోసారి టికెట్ ఇవ్వవద్దనే డిమాండ్‌తో పార్టీ పెద్దలను కలవాలని నిర్ణయించారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని ఐదుగురు శాసనసభ్యులు సర్వే సత్యనారాయణపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు హస్తిన వెళుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అపాయింట్మెంట్ను కోరుతూ లేఖ రాశారు. మాజీ మంత్రి శంకర్రావు సహా ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బండారి రాజిరెడ్డి, ఆకుల రాజేందర్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఈ మేరకు డిగ్గీరాజాకు సంయుక్తంగా లేఖ రాశారు. అధికారికంగా దిగ్విజయ్ అపాయింట్మెంట్ ఖరారు కానప్పటికీ, ఆయనకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మెల్యేలు శంకర్రావు, రాజిరెడ్డి ఇప్పటికే అక్కడ మకాం వేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ఆకుల రాజేందర్ కూడా శుక్రవారం రాత్రి దేశ రాజధానికి పయనమయ్యారు. కాగా, రంగారెడ్డి జిల్లాలో పార్టీ వ్యవహారాలు, మల్కాజిగిరి పార్లమెంటరీ సీటు పరిధిలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పార్టీ పరిస్థితిని తమతో చర్చిస్తామని లేఖలో పేర్కొన్నప్పటికీ, కేంద్ర మంత్రి సర్వేపై ఫిర్యాదు చేసే అంశమే ప్రధానంగా కనిపిస్తోంది. కొన్నాళ్లుగా సర్వేపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలు... ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కు ఈ సారి లోక్‌సభ టికెట్ రాకుండా ప్రయత్నించాలనే నిర్ణయానికి వచ్చారు. అవినీతి, గ్రూపు రాజకీయాలను కేంద్ర మంత్రి ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యేలు కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. స్థానికంగా ఆయనపై ఉన్న వ్యతిరేకత కూడా తమ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందనే భయం వీరిలో నెలకొంది. -
వర్గీకరణకు మద్దతు కూడగట్టాలి
= కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ =ఆర్ట్స అండ్ సైన్స కళాశాలలో మాదిగ ఉద్యోగుల రాష్ర్ట మహాసభ విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీ ల మద్దతు కూడగట్టాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ మాదిగ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని హన్మకొండలోని ఆర్ట్స అండ్ సైన్స కళాశాలలో శనివారం నిర్వహించిన మాదిగ ఉద్యోగుల రాష్ర్ట మహాసభలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని 20 ఏళ్లుగా పోరాడుతున్న మంద కృష్ణ కృషిని ఆయన కొనియాడారు. తాను ఒక్కడినే మాదిగ జాతి నుంచి గతంలో ఎంపీగా ఉన్నానని వివరించారు. అసెంబ్లీలో 24 మంది మాది గ ఎమ్మెల్యేలున్నా వర్గీకరణపై స్పందించ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియాగాంధీ దృష్టికి వర్గీకరణ విషయాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తే 59 మాదిగ ఉపకులాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసినప్పుడే చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదింపజేశామని వివరించారు. ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలి మాదిగ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు ప్ర వేశపెట్టేలా కృషిచేయాలని ఎమ్మార్పీస్ వ్య వస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. మరో నాలుగు నెలలైతే ఎన్నికలు రానున్నాయని తెలిపారు. అసెంబ్లీలో 24 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే 24 నిమిషాలు కూడా వర్గీకరణ కోసం మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ దండోరా ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేసి నలుగురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అడ్డంకులు ఉన్నా తెలంగా ణ బిల్లు రాష్ట్రానికి వచ్చిందని, ఎలాంటి అడ్డంకులు లేని ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఎందుకు చట్టబద్ధత రావడం లేదని ఆయ న ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో నాలుగేళ్లు మాత్రమే ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిందని, తర్వాత కోర్టు తీర్పుతో అ మలుకావడం లేదని ఆయన వివరించా రు. రాబోయే తెలంగాణలో సీఎం పదవి మాదిగ కులానికి చెందిన వ్యక్తికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షు డు కె.ప్రసాద్‌బాబు మాట్లాడుతూ వర్గీకరణతోనే మాదిగలు,ఉపకులాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో పాటు వివిధ పార్టీలు, ఎంఈఎఫ్ నాయకులు రా జారపు ప్రతాప్, డాక్టర్ రామగళ్ల పరమేశ్వ ర్, మంద వినోద్‌కుమార్, డాక్టర్ కృష్ణ య్య, ఇనుగుర్తి హన్మంంతరావు. తిప్పారపు లక్ష్మణ్, డాక్టర్ సీహెచ్.శ్రీనివాస్‌రా వు, డాక్టర్ ప్రసాద్‌బాబు, బెజవాడ పాప య్య, మల్లెపూడి సత్యనారాయణ, దిలీప్, ప్రవీణ్‌కుమార్, రాజారపు భాస్కర్, రా జేంద్రప్రసాద్, తిరుపతి, ఎంవీఎఫ్ నాయకురాలు ఆశ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో టికెట్ రాకుంటే ఎవరికీ చెప్పుకోలేం: సర్వే
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకుంటే ఎవరికీ చెప్పుకునే పరిస్థితి ఉండదని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కన్నా తానేమీ తీసిపోలేదని వ్యాఖ్యానించారు. మింట్ కాంపౌండ్‌లో ఆంధ్రప్రదేవ్ ఎలక్ట్రిసిటి బోర్డు ఎస్సీ వెల్ఫేర్ అసోషియేషన్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి సర్వే శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లో టికెట్లు ఇచ్చే ప్రక్రియ ఆఖరి వరకూ కొనసాగుతుందని, టికెట్ రాకపోయినా ఎవరికీ చెప్పుకునే అవకాశం కూడా ఉండబోదన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతున్న చిరంజీవి.. 18 శాతం ఓటర్లును పక్కన పెట్టి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన గొప్ప త్యాగజీవి అని వ్యంగ్యాస్త్రం సంధించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం ఖాయమని, ఈ దిశగా సోనియా కృషి చేస్తోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ఆస్తుల రక్షణ కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. 15 ఏళ్లుగా రోడ్డు మీద తిరుగుతున్న తనను సోనియా ఆదరించి ఇంత వాడిని చేసిందని, ఆమెకు రుణపడి ఉంటానన్నారు. తనను ఓడించేందుకు గతంలో సొంత పార్టీ నేతలే ప్రయత్నించారని, అయినా జనరల్ సీటులో పోటీ చేసి గెలిచానని మంత్రి గుర్తుచేశారు. -
నేను సీఎం కావాలంటున్నారు: సర్వే సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: ‘‘నేను ముఖ్యమంత్రిని కావాలని చాలామంది అంటున్నారు. సీఎం పదవి చెట్టుమీదున్న పిట్ట, కేంద్ర మంత్రి పదవి చేతిలోనున్న పిట్ట. చెట్టు మీద ఉన్న పిట్ట కోసం ఆరాటపడితే చేతిలో ఉన్న పిట్ట తుర్రుమనే అవకాశం ఉంది’’ అని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఎక్స్పో టెల్ హోటల్లో గురువారం క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ 26వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న రాష్ట్రాలుంటేనే పరిపాలన, ప్రజలు బాగుంటారని తెలిపారు. హైదరాబాద్ ఎవరి జాగీర్ కాదని, ఎవరైనా ఎక్కడైనా ఉండవచ్చని చెప్పారు. హెచ్ఎంటీ కంపెనీకి రూ.8.50 కోట్ల ప్యాకేజీను కేంద్రం నుంచి మంజూరు చేయించానని తెలిపారు.