గవర్నర్‌.. చెంచాగిరీ మానుకో! | sarve satyanarayana fires on Governor ESL Narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌.. చెంచాగిరీ మానుకో!

Published Tue, Jan 3 2017 12:40 AM | Last Updated on Tue, Aug 21 2018 11:49 AM

గవర్నర్‌.. చెంచాగిరీ మానుకో! - Sakshi

గవర్నర్‌.. చెంచాగిరీ మానుకో!

పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరు
 కేంద్ర మాజీ మంత్రి సర్వే


రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గవర్నర్‌గా కొనసాగే హక్కు నరసింహన్‌కు లేదని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంచాగిరీ చేస్తున్న గవర్నర్‌ను తక్షణమే పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సర్వే మాట్లాడారు. అప్రజాస్వామిక ప్రభుత్వానికి అండగా నిలుస్తూ పదవిని కాపాడుకునేందుకు.. అధికారపార్టీకి ప్రచారకర్తగా మారారని దుయ్యబట్టారు. రాజ్యాంగ ప్రతినిధిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన గవర్నర్‌.. కేసీఆర్‌ అనైతిక చర్యలకు వకల్తా పుచ్చుకోవడం దురదృష్టకరమన్నారు.  గవర్నర్‌ తన పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరడం మంచిదని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement