ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ కు గవర్నర్ ఆహ్వానం! | Governor ESL Narsimhan invited KCR to form government' | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ కు గవర్నర్ ఆహ్వానం!

Published Thu, May 29 2014 5:06 PM | Last Updated on Wed, Sep 5 2018 8:33 PM

ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ కు గవర్నర్ ఆహ్వానం! - Sakshi

ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ కు గవర్నర్ ఆహ్వానం!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్ ఆహ్వానం పంపారు. ఈ మేరకు కేసీఆర్‌కు రాజ్‌భవన్‌ వర్గాలు అధికారిక సమాచారం పంపారు. రాజ్‌భవన్‌లో నిర్వహించే ప్రమాణస్వీకార కార్యక్రమంలో జూన్‌ 2 తేది ఉదయం 8:15కు సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 
 
ఆతర్వాత జూన్‌ 2 ఉదయం 10:45కు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ పాల్గొంటారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకల్లో కేసీఆర్ తోపాటు గవర్నర్ నరసింహన్ కూడా పాలుపంచుకుంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement