హరీశ్‌ను ఏకాకిని చేశారు: సర్వే | Backstab KCR, Sarvey calls upon Harish | Sakshi
Sakshi News home page

హరీశ్‌ను ఏకాకిని చేశారు: సర్వే

Published Fri, Apr 21 2017 2:11 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

హరీశ్‌ను ఏకాకిని చేశారు: సర్వే - Sakshi

హరీశ్‌ను ఏకాకిని చేశారు: సర్వే

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో మంత్రి హరీశ్‌రావును కేసీఆర్‌ కుటుంబం ఏకాకిని చేసిందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు.తెలంగాణ ఉద్యమం నడిపిందంతా హరీశేనని, అలాగే ఉద్యమ సమయంలో చప్రాసీ పని నుండి పార్టీని నడపడం వరకు అంతా హరీశ్‌రావే చూసుకున్నారని అన్నారు. ఆ తర్వాత అమెరికా నుంచి కేసీఆర్‌ కొడుకు, కూతురు ఊడిపడ్డారన్నారు.

హరీశ్‌కు కష్టపడే తత్వం ఉందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లంతా హరీశ్‌నే కోరుకుంటున్నారన్నారు. హరీశ్‌కు ఇంకా రెండేళ్లే టైం ఉందని, తన మామకు వెన్నుపోటే పొడుస్తాడో.. ఇంకా ఏమి చేస్తాడో.. ఇప్పుడే చేయాలని సూచించారు. ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలనే కోరిక తీర్చుకోవాలని సలహానిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొంది అధికారంలోకి వస్తుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement