‘సీఎం కేసీఆర్‌ పర్యటన విజయవంతం చేయాలి’ | Harish Rao Review Meeting On KCR Visit Konda Pochama Project In Siddipet | Sakshi
Sakshi News home page

‘సీఎం కేసీఆర్‌ పర్యటన విజయవంతం చేయాలి’

Published Tue, May 26 2020 6:25 PM | Last Updated on Tue, May 26 2020 6:36 PM

Harish Rao Review Meeting On KCR Visit Konda Pochama Project In Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఈ నెల 29 (శుక్రవారం)న కొండ పోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం జరగనుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన సీఎం కేసీఆర్‌ పర్యటన ఏర్పాట్లపై మంత్రి హరీశ్‌రావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేసే దిశగా అధికారులు సమయాత్తం కావాలని జిల్లా అధికారిక వర్గాలకు దిశానిర్దేశం చేశారు. కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేయాలన్నారు. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ పోచమ్మ రిజర్వాయరును ప్రారంభోత్సవం చేసుకుంటున్న జిల్లా అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. (గోదావరి నదిలో దూకి ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య)

సీఎం కేసీఆర్‌ ఆలోచన అమలుకు రిజర్వాయర్ల జిల్లా వెనుక అధికారుల కృషి చాలా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రతి శాఖ నిద్ర లేని రాత్రులతో అహర్నిశలు కృషి చేసి అన్నీ రంగాల్లో సిద్ధిపేట జిల్లాను తొలి స్థానంలో నిలబెట్టారని అధికారుల పని తీరును కొనియాడారు. జిల్లాలో ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కార్యక్రమాలు చాలా చేశామని, ఎప్పుడూ, ఎక్కడా ఎలాంటి లోటు పాట్లు రాకుండా ప్రశంసలు పొందామన్నారు. ఈ నెల 29న జరిగే కార్యక్రమాన్ని కూడా జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం మొదలు నుంచి చివరి వరకూ సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమాలు, శాఖల వారీగా జిల్లా అధికారులకు నిర్వాహక బాధ్యతలను అప్పగిస్తూ చేపట్టాల్సిన విధులను మంత్రి హరీశ్‌ రావు వివరించారు. (‘మే 29 రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నేరవేరే రోజు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement