బాపు మృతి తీరనిలోటు. తెలుగు సినీ దర్శకునిగా, చిత్రకారునిగా, రచయితగా సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది. ఆయన మృతితో తెలుగు సాహితీలోకానికి భర్తీ చేయలేని నష్టం కలిగింది.
సాక్షి, హైదరాబాద్: బాపు మృతి తీరనిలోటు. తెలుగు సినీ దర్శకునిగా, చిత్రకారునిగా, రచయితగా సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది. ఆయన మృతితో తెలుగు సాహితీలోకానికి భర్తీ చేయలేని నష్టం కలిగింది.
- గవర్నర్ నరసింహన్
దర్శకుడిగా, చిత్రకారుడిగా, రచయితగా బాపు సినీ, కళా, సాహిత్య రంగాలకు ఎంతో సేవ చేశారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. బాపు మరణం తెలుగు ప్రజలకు, సినీరంగానికి, సాహిత్యలోకానికి తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా..
- కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి
బాపు గీత, బాపు రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. ఆయన ఇకలేరని తెలియడం ఎంతో ఆవేదన కలిగిస్తోంది. తెలుగు జాతి ఉన్నంత వరకు బాపు కార్టూన్లు, పుస్తకాలపై ముద్రించిన ముఖచిత్రాలు సజీవంగా నిలబడతాయి. తెలుగుతనం ఉట్టిపడేలా చలనచిత్రాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. బాపు మృతి చిత్రకారులకు, సినీ రంగానికి తీరనిలోటు.
- చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం
బాపు మృతి అత్యంత బాధాకరం. తెలుగు భాషకు, సినీ పరిశ్రమకు ఆయన లేని లోటు పూడ్చలేనిది అంటూ బాపు కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.
పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ అధ్యక్షుడు
‘‘బహుముఖ కళానైపుణ్యంతో తెలుగు ప్రజలకు కొత్త వెలుగు తెచ్చిన బాపుకు సాటి రాగల వ్యక్తి మరొకరు లేరు’’
- కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు
ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు కె.నారాయణ తదితరులు బాపు మృతి పట్ల సంతాపం ప్రకటించారు.