'త్వరగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కోరామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. రాజభవన్ లో గవర్నర్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. అనంతరం ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లడుతూ.. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరాం అని అన్నారు.
టీఆర్ఎస్ శాసన సభ పక్షం నేతగా కేసీఆర్ ను ఎన్నుకున్నట్టు గవర్నర్ కు ఓ వినతి పత్రం ద్వారా వెల్లడించారు. ఇటీవల 119 సీట్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 63 స్థానాలు లభించాయి. జూన్ 2 తేదిన ఏర్పడే 29వ తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరసింహన్ ను గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే.