కేసీఆర్ నీకు దండం పెడతా: సర్వే
కేసీఆర్ నీకు దండం పెడతా: సర్వే
Published Sat, Jun 24 2017 3:43 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM
హైదరాబాద్: సోనియా గాంధీకి దళితులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలంటే ప్రేమ అని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. మీరా కుమారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఆనందకరం.. ఆమెకు అన్ని అర్హతలు, సమర్ధత, అనుభవాలు ఉన్నాయన్నారు. ఎన్‌డీఏ అభ్యర్థి కోవింద్ కన్నా మీరాకుమార్ గొప్ప అభ్యర్ధని తెలిపారు. ఇందిరా హయాంలో వీవీ గిరి గెలిచినట్టుగా.. మీరా కుమార్ గెలిచే అవకాశం ఉందని.. యూపీఏ కూటమిలో ఉన్న నితీష్ సొంత నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
ఈ అంశంపై నితీష్ పునరాలోచించుకోవాలన్నారు. కేసీఆర్ మోదీ మాయలో పడ్డారని.. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ.. మీరా కుమార్ స్పీకర్‌గా ఉన్నప్పుడే తెలంగాణ బిల్‌పాస్ అయింది. కేసీఆర్‌కు దండం పెట్టి అడుగుతున్నా యూపీఏ అభ్యర్థికే మద్దతివ్వాలన్నారు. కేసీఆర్ కాబినెట్ లో దళితుడు లేడు, మహిళ లేదు.
రాష్ట్రం వస్తే దళితుడిని సీఎం చేస్తా అని చెప్పిన కేసీఆర్‌పై ఇప్పటికే దళిత వ్యతిరేకని అనే ముద్ర పడిందన్నారు. యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నామినేట్ చేసిన వారికి అసదుద్దీన్ ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు.
Advertisement
Advertisement