
జిల్లాల విభజనతోనే సీఎం పతనం ప్రారంభం
సర్వే సత్యనారాయణ
వరంగల్/జనగామ: జిల్లాల విభజనతోనే కేసీఆర్ పతనం మొదలైందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయద్దని, జనగామ జిల్లా కావాలని జిల్లా పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు మంగళవారం జరిగిన జిల్లా బంద్ లో ఆయన పాల్గొన్నారు. భువనగిరి ప్రాంతంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములున్నందునే యాదాద్రి జిల్లా తెరపైకి వచ్చిందన్నారు.
మైహోమ్స్ రామేశ్వర్‌రావు ఒక జిల్లా, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఈటెల కోసం మరో జిల్లా ఇస్తున్నాడన్నారు. హన్మకొండ జిల్లా నిర్ణయం మార్చుకోకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానన్నారు.