కేసీఆర్‌కు నిజాయితీ లేదు: సర్వే
Published Tue, Jul 4 2017 4:36 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి నీతి, నిజాయతీ లేదని మరోసారి తేలిపోయిందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ వస్తే చప్రాసిగా పనిచేస్తా, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా లాంటి ఎన్నో మాయమాటలు చెప్పి.. మాట తప్పారని పేర్కొన్నారు.
క్యాబినెట్ లో ఒక్క మహిళకి కూడా స్థానం కల్పించని కేసీఆర్‌కి మహిళల విలువ ఏం తెలుసునని ప్రశ్నించారు. అమరవీరులు, దళితులు, మహిళల పట్ల గౌరవం ఉంటే మీరాకుమార్‌కి ఓటు వేయాలన్నారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులని కలిసి మీరాకుమార్‌కి ఓటు వేయాలని కోరతామన్నారు. మీరా కుమార్‌కు టీఅర్ఎస్ నాయకులు ఓటు వేయకపోతే ప్రజలు ఎదురు తిరుగాలని కోరారు.
Advertisement
Advertisement