= కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ
=ఆర్‌ట్స అండ్ సైన్‌స కళాశాలలో మాదిగ ఉద్యోగుల రాష్ర్ట మహాసభ
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీ ల మద్దతు కూడగట్టాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ మాదిగ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని హన్మకొండలోని ఆర్‌ట్స అండ్ సైన్‌స కళాశాలలో శనివారం నిర్వహించిన మాదిగ ఉద్యోగుల రాష్ర్ట మహాసభలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టాలని 20 ఏళ్లుగా పోరాడుతున్న మంద కృష్ణ కృషిని ఆయన కొనియాడారు. తాను ఒక్కడినే మాదిగ జాతి నుంచి గతంలో ఎంపీగా ఉన్నానని వివరించారు.
అసెంబ్లీలో 24 మంది మాది గ ఎమ్మెల్యేలున్నా వర్గీకరణపై స్పందించ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియాగాంధీ దృష్టికి వర్గీకరణ విషయాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తే 59 మాదిగ ఉపకులాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసినప్పుడే చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదింపజేశామని వివరించారు.
ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలి
మాదిగ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు ప్ర వేశపెట్టేలా కృషిచేయాలని ఎమ్మార్పీస్ వ్య వస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. మరో నాలుగు నెలలైతే ఎన్నికలు రానున్నాయని తెలిపారు. అసెంబ్లీలో 24 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే 24 నిమిషాలు కూడా వర్గీకరణ కోసం మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ దండోరా ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేసి నలుగురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అడ్డంకులు ఉన్నా తెలంగా ణ బిల్లు రాష్ట్రానికి వచ్చిందని, ఎలాంటి అడ్డంకులు లేని ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఎందుకు చట్టబద్ధత రావడం లేదని ఆయ న ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో నాలుగేళ్లు మాత్రమే ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిందని, తర్వాత కోర్టు తీర్పుతో అ మలుకావడం లేదని ఆయన వివరించా రు. రాబోయే తెలంగాణలో సీఎం పదవి మాదిగ కులానికి చెందిన వ్యక్తికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షు డు కె.ప్రసాద్‌బాబు మాట్లాడుతూ వర్గీకరణతోనే మాదిగలు,ఉపకులాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో పాటు వివిధ పార్టీలు, ఎంఈఎఫ్ నాయకులు రా జారపు ప్రతాప్, డాక్టర్ రామగళ్ల పరమేశ్వ ర్, మంద వినోద్‌కుమార్, డాక్టర్ కృష్ణ య్య, ఇనుగుర్తి హన్మంంతరావు. తిప్పారపు లక్ష్మణ్, డాక్టర్ సీహెచ్.శ్రీనివాస్‌రా వు, డాక్టర్ ప్రసాద్‌బాబు, బెజవాడ పాప య్య, మల్లెపూడి సత్యనారాయణ, దిలీప్, ప్రవీణ్‌కుమార్, రాజారపు భాస్కర్, రా జేంద్రప్రసాద్, తిరుపతి, ఎంవీఎఫ్ నాయకురాలు ఆశ పాల్గొన్నారు.
వర్గీకరణకు మద్దతు కూడగట్టాలి
Published Sun, Dec 15 2013 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement