Arts and Science College
-
విద్యార్థిని చితకబాదిన ఇతర విద్యార్థులు! అసలు కారణమేంటి..?
వరంగల్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాలలో శనివారం సాయంత్రం విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. బీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు.. బీఏ ద్వితీయ ,ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆ కళాశాలలో ఆడిటోరియంలో వెల్కమ్ పార్టీ నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటల వరకు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ తరువాత చాలా మంది విద్యార్థులు కళాశాల ఆవరణకు చేరుకున్నారు. కొందరు ఫొటోలు దిగుతున్నారు. ఈ సమయంలో ఏమైందో తెలియదుగాని ఓ ఫస్టియర్ విద్యార్థిని ద్వితీయ సంవత్సరం విద్యార్థులుగా భావిస్తున్న కొందరు చితకబాదారని సమాచారం. ఆ విద్యార్థిని వెంబడించి మరి చితకబాదారని తెలుస్తోంది. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు అధ్యాపకులు ఘటనాస్థలికి చేరుకుని ఈ గొడవను నిలువరించారని సమాచారం. అనంతరం విద్యార్థులను కళాశాల నుంచి బయటికి పంపారు. కాగా, విద్యార్థిని ఎందుకు చితకబాదారనే విషయం తెలియరాలేదు. ఈ గొడవ విషయంపై ఆ కళాశాల ప్రిన్సిపాల్ బన్న ఐలయ్య దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. గొడవ పడిన విద్యార్థులను ఈనెల 8న లేదా 9న పిలిపించి మాట్లాడాలని యోచిస్తున్నారని సమాచారం. దీనిపై ప్రిన్సిపాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
రేపు పతంగుల పండుగ
వరంగల్‌లో మొదటిసారి అంతర్జాతీయ వేడుక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వేదికగా సంబరాలు పాల్గొననున్న 31 దేశాల క్రీడాకారులు స్టాల్స్, ఫుడ్ కోర్టుల ఏర్పాటు నేడు నగరంలో హెరిటేజ్ వాక్ హన్మకొండ : వరంగల్‌లో తొలిసారి జరగనున్న అంతర్జాతీయ పతంగుల పండుగకు ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వేదికగా మంగళవారం పతంగుల పండగ జరగనుంది. ప్రపంచ పర్యాటకుల దృష్టిని వరంగల్ వైపు ఆకర్షించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఈ పండుగ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవాలనే భావనతో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశవిదేశాల క్రీడాకారులు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరగనున్న అంతర్జాతీయ పతంగుల పండుగలో 31 దేశాల నుంచి ఔత్సాహిక పంతగుల క్రీడాకారులు పాల్గొననున్నారు. అలాగే, మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది మంది క్రీడాకారులు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. పతంగుల పండుగ వివరాలు, ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నగరంలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు. ఉదయం 6.30 గంటలకు హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్స్ నుంచి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానం వరకు ఈ హెరిటేజ్ వాక్ జరగనుంది. అలాగే, మంగళవారం కూడా ఉదయం 6.30 గంటలకు ఖిలా వరంగల్‌లో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. అనంతరం అల్పాహారం చేశాక పతంగులు ఎగురవేస్తారు. కాగా, పతంగుల పండుగ జరిగే చోట క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ జర్రీస్, పెంబర్తి కళాఖండాలు, చేర్యాల నఖాసీ చిత్రాలు, హస్తకళలు, చేనేత ఉత్పత్తులను 30 స్టాళ్లలో అందుబాటులో ఉంచుతారు. వీటితో పాటు పండుగను వీక్షించేందుకు వచ్చే ప్రజల కోసం ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. -
‘ప్రణాళిక’ కోసం రూ.32.47 కోట్లు
హన్మకొండ అర్బన్ : మన ఊరు-మన ప్రణాళిక అమలు కోసం రూ.32.47 కోట్లనిధులు మంజూరయ్యూయని కలెక్టర్ కిషన్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రణాళికల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనాభా ఆధారంగా నిధులు మంజూరయ్యూయని పేర్కొన్నారు. మంజూరైన నిధుల్లో 50 శాతం పంచాయతీలు, 30 శాతం మండల పరిషత్‌లు, 20 శాతం జిల్లా అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా.. ఆ మేరకు కేటాయింపులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తాగునీరు, కిచెన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, కార్పొరేషన్లో విలీనమైన 42 గ్రామాల్లో లింకు రోడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, తండాల్లో విద్యుత్ సౌకర్యం, వీధిదీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖకు సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లు, సోషల్ వెల్ఫేర్ డీడీ రోశన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 26న పర్యాటక శాఖ ప్యాకేజీ టూర్ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఈనెల 26న ప్యాకేజీ టూర్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక శాఖ ప్యాకేజీ టూర్లో భాగంగా రామప్ప, లక్నవరం, ఖిలావరంగల్‌లో సౌండ్‌అండ్ లైట్స్ షో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 25వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటలోపు 9392445721, 9849338854, 9866919131 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రత్యేక సదస్సు, 25 నుంచి 27 వరకు పబ్లిక్‌గార్డెన్‌లోని టౌన్హాల్లో పర్యాటక ప్రాంతాల ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందని కలెక్టర్ కిషన్ తెలిపారు. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : విద్యార్థులు సామాజిక శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ జి.కిషన్ కోరా రు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ క ళాశాలలో సోమవారం సెట్వార్ ఇంట ర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్, సోషల్ వర్క్ డిపార్టమెంట్ ఆధ్వర్యంలో కేయూ ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులకు ఓరియెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాల ప్రాధాన్యతను లబ్ధిదారులకు తెలియజేసి వారిలో అపోహలను తొలగించాలని పేర్కొన్నారు. విభజనకు ముందు రాష్ర్ట బడ్జెట్ ఒక లక్షా 15వేల కోట్లని, కేంద్రం ద్వారా రూ.15 లక్షల కోట్లతో పేదలకు సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ప థకాల అమలు కోసం విద్యార్థులు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రజల కు ఆహారం, నీరు, విద్య, ఉపాధి, గూడు తదితర వసతులపై దృష్టిసారించాలని సూచించారు. నాగరికత పెరిగిన కొద్దీ అ లవాట్లు మారి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. మంచి అలవాట్లకు దూరమై మన ముందున్న మంచిని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆ వేదన వ్యక్తం చేశారు. గతంలో లక్ష మందిలో ఒకరికి కేన్సర్ ఉండగా.. ప్రస్తు తం ప్రతి వేయి మందిలో పది మందికి ఉంటుందన్నారు. సామాజిక దురాచారాలు, పారిశుద్ధ్యంపై ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తొలుత గ్రామీణ నీటిపారుదల, గృహ నిర్మాణం, డీఆర్డీఏ, వెనుకబడిన తరగతుల సం క్షేమం, స్త్రీ, శిశు సంక్షేమం, వైద్య, ఆరోగ్యం తదితర శాఖల ద్వారా అమలయ్యే పథకాల గురించి పవర్‌పాయింట్ ప్రజం టేషన్ ద్వారా సంబంధిత అధికారులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సెట్వార్ సీఈఓ పురుషోత్తమ్, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ మనోరంజన్, డీఆర్డీఏ పీడీ శంకరయ్య, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ) విభాగం అధిపతి ప్రొఫెసర్ కె.రామానుజరావు మాట్లాడారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, న్యూసైన్స్, గాయత్రి, మాస్టర్జీ, మహర్షి తదితర కళాశాలల ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు పాల్గొన్నారు. -
వర్గీకరణకు మద్దతు కూడగట్టాలి
= కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ =ఆర్ట్స అండ్ సైన్స కళాశాలలో మాదిగ ఉద్యోగుల రాష్ర్ట మహాసభ విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీ ల మద్దతు కూడగట్టాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ మాదిగ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని హన్మకొండలోని ఆర్ట్స అండ్ సైన్స కళాశాలలో శనివారం నిర్వహించిన మాదిగ ఉద్యోగుల రాష్ర్ట మహాసభలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని 20 ఏళ్లుగా పోరాడుతున్న మంద కృష్ణ కృషిని ఆయన కొనియాడారు. తాను ఒక్కడినే మాదిగ జాతి నుంచి గతంలో ఎంపీగా ఉన్నానని వివరించారు. అసెంబ్లీలో 24 మంది మాది గ ఎమ్మెల్యేలున్నా వర్గీకరణపై స్పందించ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియాగాంధీ దృష్టికి వర్గీకరణ విషయాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తే 59 మాదిగ ఉపకులాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసినప్పుడే చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదింపజేశామని వివరించారు. ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలి మాదిగ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు ప్ర వేశపెట్టేలా కృషిచేయాలని ఎమ్మార్పీస్ వ్య వస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. మరో నాలుగు నెలలైతే ఎన్నికలు రానున్నాయని తెలిపారు. అసెంబ్లీలో 24 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే 24 నిమిషాలు కూడా వర్గీకరణ కోసం మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ దండోరా ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేసి నలుగురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అడ్డంకులు ఉన్నా తెలంగా ణ బిల్లు రాష్ట్రానికి వచ్చిందని, ఎలాంటి అడ్డంకులు లేని ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఎందుకు చట్టబద్ధత రావడం లేదని ఆయ న ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో నాలుగేళ్లు మాత్రమే ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిందని, తర్వాత కోర్టు తీర్పుతో అ మలుకావడం లేదని ఆయన వివరించా రు. రాబోయే తెలంగాణలో సీఎం పదవి మాదిగ కులానికి చెందిన వ్యక్తికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షు డు కె.ప్రసాద్‌బాబు మాట్లాడుతూ వర్గీకరణతోనే మాదిగలు,ఉపకులాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో పాటు వివిధ పార్టీలు, ఎంఈఎఫ్ నాయకులు రా జారపు ప్రతాప్, డాక్టర్ రామగళ్ల పరమేశ్వ ర్, మంద వినోద్‌కుమార్, డాక్టర్ కృష్ణ య్య, ఇనుగుర్తి హన్మంంతరావు. తిప్పారపు లక్ష్మణ్, డాక్టర్ సీహెచ్.శ్రీనివాస్‌రా వు, డాక్టర్ ప్రసాద్‌బాబు, బెజవాడ పాప య్య, మల్లెపూడి సత్యనారాయణ, దిలీప్, ప్రవీణ్‌కుమార్, రాజారపు భాస్కర్, రా జేంద్రప్రసాద్, తిరుపతి, ఎంవీఎఫ్ నాయకురాలు ఆశ పాల్గొన్నారు.